|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

నటుడు దర్శన్‌కు బెయిల్ ఇవ్వడంపై సుప్రీంకోర్టు అభ్యంతరం

Published: 17-07-2025, 11:22 AM
నటుడు దర్శన్‌కు బెయిల్ ఇవ్వడంపై సుప్రీంకోర్టు అభ్యంతరం

రేణుకాస్వామి హత్య కేసులో నిందితుడైన నటుడు దర్శన్‌కు హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంపై సుప్రీం కోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. హైకోర్టు తన అధికారాలను ఎలా ఉపయోగించిందనే దానిపై సుప్రీం కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది.

Key Points

1

రేణుకాస్వామి హత్య కేసులో దర్శన్ నిందితుడు.

2

హైకోర్టు దర్శన్‌కు బెయిల్ మంజూరు చేసింది.

4

సుప్రీం కోర్టు బెయిల్ ఉత్తర్వులపై తమ జోక్యం ఎందుకు చేయకూడదో నిందితుల న్యాయవాదిని ప్రశ్నించింది.

హైకోర్టు బెయిల్ మంజూరు

దిశ‌, వెబ్ డెస్క్: రేణుకాస్వామి హత్య కేసులో నింధితుడిగా ఉన్న హీరో దర్శన్‌కు హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ తీర్పుపై సుప్రీం ధర్మాసనం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. హైకోర్టు తన విచక్షణాధికారాన్ని ఉపయోగించిన విధానంతో తాము ఏకీభవించలేమని చెప్పింది. బెయిల్ ఉత్తర్వుల విషయంలో తాము ఎందుకు జోక్యం చేసుకోకూడదో తెలపాలని నింధుతుడి తరపు లాయర్ ను ప్రశ్నించింది. ఇదిలా ఉంటే రేణుకాస్వామి హత్య కేసులో నింధితుడుగా ఉన్న దర్శన్‌కు గతేడాది అక్టోబర్ లో మధ్యంతర బెయిల్ ఇవ్వగా డిసెంబర్ 13న కర్నాటక హైకోర్టు రెగ్యులర్ బెయిల్ ఇచ్చింది. దానిని వ్యతిరేకిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. విచారణ జరిపిన సుప్రీంకోర్టు హైకోర్టు తీర్పుపై అభ్యంతరం వ్యక్తం చేసింది.

సుప్రీం కోర్టు అభ్యంతరం

రాష్ట్ర ప్రభుత్వం సవాల్

సుప్రీం కోర్టు హైకోర్టు తీర్పును తీవ్రంగా వ్యతిరేకిస్తూ, బెయిల్ విషయంలో తమ జోక్యం ఎందుకు చేయకూడదో నిందితుల న్యాయవాదిని ప్రశ్నించింది. ఈ కేసులో తదుపరి విచారణ కోసం వేచి చూడాల్సి ఉంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.