
📌 Key Points
- చిరంజీవి నటించిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రం సంక్రాంతికి విడుదలైంది.
- సినిమా విడుదలైన మూడు రోజుల్లోనే 150 కోట్లకు పైగా వసూలు చేసింది.
- సురేఖ, తన స్నేహితులతో కలిసి సినిమా చూసి చాలా సంతోషించారట.
- చిరంజీవి సినిమాలు విడుదలయితే సురేఖ తన అభిప్రాయం తెలియజేస్తారు.
మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా సంక్రాంతికి విడుదలై మంచి విజయం సాధించింది. ఈ సినిమాపై సురేఖ ఎలా స్పందించారో చిరంజీవి స్వయంగా వెల్లడించారు. ఆమె రియాక్షన్ ఇప్పుడు వైరల్ అవుతోంది.
MSVPG సినిమా సక్సెస్ సెలెబ్రేషన్స్
Surekha On MSVPG Film: మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన మన శంకర వరప్రసాద్ గారు (MSVPG) సినిమా సంక్రాంతి పండుగను పురస్కరించుకొని జనవరి 12వ తేదీ విడుదలైన సంగతి తెలిసిందే. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో చిరంజీవి(Chiranjeevi), నయనతార జంటగా నటించారు. ఇక ఈ సినిమా విడుదలైన మూడు రోజులకే ఏకంగా 150 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టిన సంగతి తెలిసిందే. ఇలా ఈ సినిమాకు మంచి ఆదరణ లభిస్తున్న నేపథ్యంలో చిత్ర బృందం ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక చిత్ర బృందం కూడా సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించిన సంగతి తెలిసిందే.
ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకోవడంతో అనిల్ రావిపూడి చిరంజీవి వెంకటేష్ కలిసి ఒక ఇంటర్వ్యూ నిర్వహించారు ఈ ఇంటర్వ్యూ కి సంబంధించిన పూర్తి వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఇందులో భాగంగా అనిల్ రావిపూడి చిరంజీవి గారిని ప్రశ్నిస్తూ.. ఈ సినిమాకు పెద్ద ఎత్తున మహిళల ఆదరణ లభిస్తుంది. ముఖ్యంగా ఈ సినిమా చూసిన తర్వాత మీ ఇంట్లో మహిళల గురించి ఆలోచిస్తే ముందుగా సురేఖ గారు గుర్తుకొస్తారు. సినిమా చూసిన తర్వాత సురేఖ గారి రియాక్షన్ ఏంటి అంటూ ప్రశ్న వేశారు. ఈ ప్రశ్నకు చిరంజీవి సమాధానం చెబుతూ ఈ సినిమా రష్ చూసినప్పుడు సురేఖ ఎలాంటి అభిప్రాయాన్ని తెలియజేయలేదు కానీ మీరు ఈ సినిమా కోసం చేస్తున్న సన్నివేశాలు చూస్తుంటే నాకు గతంలో మీ సినిమాలను చూస్తూ ఎంజాయ్ చేసిన భావన కలుగుతోందని సురేఖ చెప్పినట్లు చిరంజీవి తెలియచేశారు.
సురేఖ రియాక్షన్ గురించి చిరంజీవి ఏమన్నారంటే?
ఇక ఈ సినిమా విడుదలైన తర్వాత సురేఖ కిట్టి పార్టీ ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు వారందరూ కలిసి థియేటర్ వెళ్లి ఈ చూస్తూ బాగా నవ్వుకున్నారని చెప్పినట్లు చిరంజీవి వెల్లడించారు. ఇక ఈ సినిమాలో కూడా కిట్టి పార్టీకి సంబంధించిన సీన్స్ ఉండడంతో మా మీద సెటైర్స్ వేస్తున్నారా? అనుకుంటుంది భావించాను కానీ , సురేఖ మాత్రం సినిమా చూస్తూ చాలా బాగా నవ్వుకున్నామని బాగా ఎంజాయ్ చేశామని తెలిపారు. మరోసారి కూడా తన ఫ్రెండ్స్ ఈ సినిమా చూడాలని పిలుస్తున్నారట వీలు చూసుకొని వెళ్తానని సురేఖ ఈ సినిమా గురించి తన అభిప్రాయాన్ని తెలియజేసిందంటూ చిరంజీవి సురేఖ అభిప్రాయాన్ని తెలియజేశారు.
డిజాస్టర్ సినిమా తర్వాత హిట్ కొట్టిన చిరు…
సినిమా చూసి సురేఖ ఎలా ఎంజాయ్ చేశారో తెలుసా?
ఇక చిరంజీవి సినిమాలు ఏదైనా విడుదల అయ్యాయి అంటే కచ్చితంగా సురేఖ సినిమా చూసి తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ ఉంటారని ఎన్నో సందర్భాలలో చిరంజీవి తెలియజేశారు. ఇక మన శంకర్ వరప్రసాద్ సినిమా కూడా తనకు చాలా బాగా నచ్చిందని చెప్పినట్టు తాజా ఇంటర్వ్యూలో చిరంజీవి తెలియచేశారు. భోళా శంకర్ వంటి డిజాస్టర్ సినిమా తర్వాత చిరంజీవి అనిల్ రావిపూడి కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా అమితంగా ప్రేక్షకులను ఆకట్టుకొని మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.
చిరంజీవి నటించిన ప్రతి సినిమాను సురేఖ చూసి తన అభిప్రాయాన్ని తెలియజేస్తారు. ఈ సినిమాను కూడా ఆమె ఎంతో ఆనందించారని చిరంజీవి తెలిపారు. ఇది అభిమానులకు సంతోషాన్ని కలిగిస్తుంది.


