|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Sushmita Konidela : మా ఇద్దరి మధ్య గొడవలకు కారణం పవన్ బాబాయే.. చిరు కూతురు ఆసక్తికర వ్యాఖ్యలు..

Published: 19-08-2025, 1:46 PM
Sushmita Konidela : మా ఇద్దరి మధ్య గొడవలకు కారణం పవన్ బాబాయే.. చిరు కూతురు ఆసక్తికర వ్యాఖ్యలు..

చిరంజీవి కుమార్తె సుస్మిత కొణిదెల ఇటీవల ఓ టీవీ షోలో పాల్గొని తన కుటుంబం, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ తో తన అనుబంధం గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. ఆమె చరణ్ తో తనకున్న గొడవలకు పవన్ కళ్యాణ్ కారణమని చెప్పడం విశేషం.

Key Points

1

సుస్మిత కొణిదెల తన కుటుంబ జీవితం గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది.

2

పవన్ కళ్యాణ్ బాల్యంలో సుస్మిత మరియు చరణ్ మధ్య గొడవలకు కారణమని ఆమె తెలిపింది.

4

సుస్మిత ప్రస్తుతం కాస్ట్యూమ్ డిజైనర్ గానూ, నిర్మాణ సంస్థను నడిపిస్తున్నట్లు తెలిసింది.

సుస్మిత కొణిదెల యొక్క ఆసక్తికర వ్యాఖ్యలు

Sushmita Konidela : పవన్ కళ్యాణ్ కి మెగా ఫ్యామిలీలో ఉన్న ఈ జనరేషన్ కజిన్స్ అందరికి ప్రత్యేకమైన అనుబంధం ఉంది. పవన్ కెరీర్ మొదలు పెట్టకముందు ఇంట్లో పిల్లలు అందర్నీ తనే చూసుకునే వాడు అని పవన్, చిరు, చరణ్.. పలు సందర్భాలలో తెలిపారు. దీంతో మెగా ఫ్యామిలీ లో ఉన్న పిల్లు అంతా పవన్ కి బాగా క్లోజ్.(Sushmita Konidela)

చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత ప్రస్తుతం కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేస్తూనే నిర్మాణ సంస్థను నడిపిస్తుంది. తన నిర్మాణ సంస్థలో ఇప్పుడు చిరు – అనిల్ రావిపూడి సినిమా తెరకెక్కిస్తుంది. తాజాగా సుస్మిత ఓ టీవీ షోకి గెస్ట్ గా హాజరైంది. ఈ షోలో మీ పవన్ కళ్యాణ్ బాబాయ్ గురించి ఏదైనా ఆసక్తికర విషయం, మీకు ఉన్న అనుబంధం గురించి చెప్పమని అడిగారు.

పవన్ కళ్యాణ్ మరియు మెగా ఫ్యామిలీ అనుబంధం

సుస్మిత కొణిదెల మాట్లాడుతూ.. ఆయనతో మేము చిన్నప్పట్నుంచి కలిసి పెరిగాము. నాకు చరణ్ కి మధ్య గొడవలు ఉండవు. మేము బాగానే కలిసి ఉంటాము. మా ఇద్దరికీ గొడవలు వచ్చాయి అంటే అది బాబాయ్ వల్లే. అప్పట్లో టీవీలో అంత ఎంటర్టైన్మెంట్ ఉండదు కదా. ఆయనకు బోర్ కొట్టినప్పుడల్లా నాకు, చరణ్ కి మధ్య ఏదో ఒకటి వదులుతారు. మేము ఇద్దరం కొట్టుకుంటూ ఉంటాము ఆయన చూసి ఎంజాయ్ చేస్తూ ఉంటారు అని నవ్వుతూ చిన్నప్పటి సంగతి తెలిపింది.

చిన్ననాటి జ్ఞాపకాలను పంచుకున్న సుస్మిత

సుస్మిత కొణిదెల తన బాల్య జీవితం మరియు మెగా ఫ్యామిలీలోని అనుబంధాల గురించి వెల్లడించిన విషయాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ తో ఉన్న ఆమె అనుబంధం గురించి ఆమె పంచుకున్న విషయాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.