|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

దీపికా పదుకోన్ వీడియోను నేను లైక్ చేయలేదు.. ఇన్‌స్టాగ్రామ్ దానికదే చేసింది: తమన్నా పోస్ట్ వైరల్

Published: 28-05-2025, 8:59 AM

బాలీవుడ్ నటి దీపికా పదుకోన్ పై సందీప్ రెడ్డి వంగా చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో తమన్నా చేసిన ఓ ఇన్‌స్టాగ్రామ్ లైక్ వైరల్ అయింది. ఆమె దీనిపై స్పష్టీకరణ ఇవ్వడం విశేషం.

Key Points

1

తమన్నా లైక్ చేసినట్లు వచ్చిన వార్తలపై ఆమె స్పష్టతనిచ్చింది.

2

ఇన్‌స్టాగ్రామ్ దానికదే లైక్ చేసిందని తమన్నా పేర్కొంది.

4

తమన్నా సోషల్ మీడియా పోస్ట్ వైరల్ గా మారింది.

తమన్నా వివరణ

తన స్పిరిట్ మూవీ స్టోరీని లీక్ చేసిందంటూ బాలీవుడ్ నటి దీపికా పదుకోన్ పై డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా మండిపడిన విషయం తెలుసు కదా. ఈ విషయంలో దీపికకు తాను సపోర్ట్ చేస్తున్నట్లుగా ఓ రీల్ ను లైక్ చేయడం ద్వారా తమన్నా చెప్పకనే చెప్పిందన్న వార్తలు వచ్చాయి. అయితే ఆ వీడియోను తాను లైక్ చేయలేదన్నట్లుగా ఇప్పుడు తమన్నా వివరణ ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఇన్‌స్టా దానికదే లైక్ చేసింది

తమన్నా భాటియా తన లైక్ వార్తపై ఇన్‌స్టా స్టోరీ ద్వారా వివరణ ఇచ్చింది. నేరుగా దీపికా పదుకోన్ పేరుగానీ, ఆమె ఉన్న రీల్ గురించిగానీ ప్రస్తావించకుండా.. తమన్నా తన సెల్ఫీని షేర్ చేస్తూ చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. “తనకు తానుగా పేజీలను ఎలా లైక్ చేస్తుందో ఇన్‌స్టాగ్రామ్ చెప్పగలదా? ఎందుకంటే ఎవరెవరో దీనిని పెద్ద వార్తగా మలిచేశారు. నాకు చేయాల్సిన పని చాలా ఉంది” అని తమన్నా రాసింది.

ఇన్‌స్టాగ్రామ్ లైక్ వివాదం

తమన్నా భాటియా బుధవారం (మే 28) ఉదయం ఓ పాత రీల్ కు లైక్ కొట్టినట్లుగా వార్తలు వచ్చాయి. అందులో దీపికా పదుకోన్ తాను 2020లో చేసిన ఛపాక్ మూవీపై మాట్లాడింది. అందులో రణ్‌వీర్ ఈ ప్రొడక్షన్ హౌజ్ లో డబ్బులు పెట్టాడా అని ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు అవి నా డబ్బులు.. మీకెవరు చెప్పారంటూ నవ్వుతూ అనడం చూడొచ్చు.

అగౌరవం, సెక్సిజం, జీతంలో లింగ భేదం, ఓవర్ టైమ్ పని చేయడం, ప్రొఫెషనలిజం లేకపోవడం, ద్వంద్వ ప్రమాణాలకు ఆమె వ్యతిరేకం అని రాసి ఉన్న రీల్ అది. దీనికి తమన్నా లైక్ కొట్టినట్లుగా ఉంది. దీంతో సందీప్ రెడ్డి వంగా వివాదం విషయంలో దీపికకు తమన్నా మద్దతుగా నిలిచిందన్న వార్తలు వచ్చాయి. దీంతో తమన్నా దీనిపై పరోక్షంగా వివరణ ఇచ్చింది.

దీపికా-సందీప్ వివాదం నేపథ్యం

సందీప్ రెడ్డి వంగా , ప్రభాస్ మూవీ అయిన స్పిరిట్ నుంచి దీపికా వెళ్లిపోవడానికి ఆ మూవీ టీమ్ చేసిన కొన్ని అన్‌ప్రొఫెషన్ డిమాండ్లే కారణమన్న వార్తలు వచ్చాయి. అయితే వెళ్తూ వెళ్తూ తన మూవీ స్టోరీని లీక్ చేసిందంటూ దీపికపై సందీప్ మండిపడుతూ ఇదేనీ నీ ఫెమినిజం అంటూ తీవ్రంగా మండిపడ్డాడు.

ఈ స్పిరిట్ మూవీ కోసం రోజుకు ఆరు గంటల కంటే ఎక్కువగా పని చేయబోనని, అగ్రిమెంట్లో ఉన్నట్లుగా 100 రోజుల షూటింగ్ దాటితే ప్రతి రోజూ అదనంగా చెల్లించాలని దీపిక డిమాండ్ చేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఓవర్‌టైమ్ కు వ్యతిరేకంగా దీపిక చేస్తున్న పోరాటానికి తమన్నా ఇలా ఓ రీల్ ను లైక్ చేయడం ద్వారా మద్దతిచ్చినట్లు వార్తలు రావడంతో ఆమె నేరుగా రంగంలోకి దిగాల్సి వచ్చింది. దీపిక వెళ్లిపోవడంతో ఆమె స్థానంలో స్పిరిట్ మూవీ కోసం తృప్తి డిమ్రిని తీసుకున్న విషయం తెలిసిందే.

తమన్నా ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా తన స్పష్టతను తెలియజేసింది. ఈ వివాదం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. దీపికా పదుకోన్ మరియు సందీప్ రెడ్డి వంగా వివాదం ఇంకా కొనసాగుతోంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.