
📌 Key Points
- తమన్నా మళ్లీ టాలీవుడ్ లో హీరోయిన్ గా సందడి చేయనుంది.
- రవితేజ, శివ నిర్వాణ కాంబినేషన్ లో వస్తున్న ‘ఇరుముడి’ సినిమాలో తమన్నా నటిస్తుంది.
- ఈ సినిమాలో ప్రియా భవాని శంకర్ కూడా మరో హీరోయిన్ గా నటిస్తోంది.
- తమన్నా రవితేజతో కలిసి నటించడం హాట్ టాపిక్ గా మారింది.
మిల్కీ బ్యూటీ తమన్నా టాలీవుడ్ లో రీఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. మాస్ మహారాజా రవితేజ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో వస్తున్న ‘ఇరుముడి’ సినిమాలో ఆమె హీరోయిన్ గా నటించనుంది. ఈ వార్త ఇప్పుడు సినీ వర్గాల్లో వైరల్ అవుతోంది.
తమన్నా టాలీవుడ్ రీఎంట్రీ
Tamannaah: మిల్కీ బ్యూటీ తమన్న (Tamannaah) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. బాలీవుడ్ బ్యూటీ అయినప్పటికీ టాలీవుడ్ లో తొలిసారి ‘శ్రీ’ అనే సినిమా ద్వారా అడుగుపెట్టి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ తర్వాత శేఖర్ కమ్ముల (Sekhar kammula) దర్శకత్వంలో వచ్చిన ‘హ్యాపీడేస్’ సినిమాతో ఊహించని పాపులారిటీ సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇక ఆ తర్వాత కాళిదాసు, రెడీ, కొంచెం ఇష్టం కొంచెం కష్టం, 100% లవ్, బద్రీనాథ్, ఊసరవెల్లి, రచ్చ, ఎందుకంటే ప్రేమంట ఇలా పలు చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈమె.. 2015లో వచ్చిన ‘బాహుబలి: ది బిగినింగ్’ సినిమాతో తన పాపులారిటీని అమాంతం పెంచేసుకుంది. ఈ ఒక్క సినిమాతో పాన్ ఇండియా వైడ్ క్రేజ్ దక్కించుకుంది ఈ ముద్దుగుమ్మ.
ఇక తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ, మరాఠీ భాషల్లో సినిమాలు చేస్తూ భారీ పాపులారిటీ అందుకున్న తమన్నా.. చివరిగా ‘ఓదెల 2’ సినిమాలో కనిపించి మళ్లీ తెలుగు ప్రేక్షకులను అలరించలేదు. గత ఏడాది వచ్చిన ఈ సినిమా పరవాలేదు అనిపించుకుంది. ప్రస్తుతం స్పెషల్ సాంగ్ లు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈమె.. అటు బాలీవుడ్ లో ఏకంగా నాలుగు చిత్రాలతో బిజీగా మారిపోయిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు హీరోయిన్ గా క్రేజీ కం బ్యాక్ ఇవ్వాలి అని అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్న వేళ.. ఏకంగా స్టార్ హీరోతో సినిమా చేయడానికి సిద్ధం అయినట్లు సమాచారం.
రవితేజతో తమన్నా జోడి కట్టనుందా?
ఆయన ఎవరో కాదు మాస్ మహారాజా రవితేజ (Rajiteja) . ‘ధమాకా’ సినిమా తర్వాత మళ్లీ ఆ రేంజ్ లో సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న రవితేజకు ఇప్పటివరకు అలాంటి సక్సెస్ లభించలేదు అనడంలో సందేహం లేదు. ఈ ఏడాది ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కానీ ఇది కూడా అనుకున్నంత రేంజ్ లో హిట్ నైతే అందించలేదు. ఇక అలాంటి ఈయిన తాజాగా ‘మజిలీ’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు శివానిర్వాన దర్శకత్వంలో వస్తున్న ‘ఇరుముడి’ సినిమాలో నటిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో వస్తున్న ఈ సినిమాలో రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్నారు.
ఇరుముడి సినిమాలో తమన్నా పాత్ర
ఇక ప్రియా భవాని శంకర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో తమన్నా కూడా నటిస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా ద్విపాత్రాభినయంలో ఒక పాత్రకు ప్రియా భవాని శంకర్.. మరోపాత్రకు తమన్నా హీరోయిన్గా నటిస్తున్నట్లు తెలుస్తోంది . త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన కూడా వెలువడనుంది. ఏది ఏమైనా రవితేజ ఇరుముడి సినిమాలో తమన్నా నటించబోతోంది అంటూ వస్తున్న వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అసలే సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న రవితేజ.. మరొకవైపు టాలీవుడ్ లో సాలిడ్ హిట్ కోసం ఎదురు చూస్తున్న తమన్నా ఈ సినిమాతో ఎలాంటి సక్సెస్ ను సొంతం చేసుకుంటారో చూడాలి. ఏది ఏమైనా ఇద్దరికీ అత్యంత స్పెషల్ గా మారిన ఈ సినిమాతో శివ నిర్మాణ కచ్చితంగా సక్సెస్ అందించాలని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
మొత్తానికి తమన్నా టాలీవుడ్ రీఎంట్రీ రవితేజ సినిమాతో జరగనుండటం అభిమానులకు ఆనందాన్ని కలిగిస్తోంది. ఈ సినిమాతో ఆమె ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.


