|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Tamannaah: ‘ప్రభాస్‌తో బాహుబలి సీన్‌.. అత్యాచారమని నేను అనుకోను’

Published: 03-08-2025, 9:15 AM
Tamannaah: 'ప్రభాస్‌తో బాహుబలి సీన్‌.. అత్యాచారమని నేను అనుకోను'

మిల్కీ బ్యూటీ తమన్నా బాహుబలి సినిమాలోని ఒక సన్నివేశంపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ప్రభాస్‌తో ఉన్న ఆ సన్నివేశంపై వచ్చిన విమర్శలకు ఆమె స్పందిస్తూ, తనదైన దృష్టికోణాన్ని వివరించింది.

Key Points

1

తమన్నా బాహుబలి సినిమాలోని ఓ సన్నివేశంపై స్పందించింది.

2

ప్రభాస్‌తో ఉన్న రొమాంటిక్ ఫైట్ సీన్‌ను అత్యాచారంగా భావించలేదని తెలిపింది.

4

కొందరి దృక్పథాలను బట్టి అర్థాలు మారవచ్చునని, తాను సృజనాత్మకతను మెచ్చుకుంటానని వివరించింది.

బాహుబలి సన్నివేశంపై తమన్నా స్పందన

మిల్కీ బ్యూటీ తమన్నా ప్రస్తుతం పెద్దగా సినిమాలేవీ చేయట్లేదు . ఈ ఏడాది ఓదెల -2 మూవీతో మెప్పించిన ముద్దుగుమ్మ .. కేవలం బాలీవుడ్ ‌ కే పరిమితమైంది . అడపా .. దడపా సినిమాలు చేస్తూ ఐటమ్ ‌ సాంగ్స్ ‌ తోనూ అలరిస్తోంది . టాలీవుడ్ ‌ లో సూపర్ హిట్ ‌ సినిమాల్లో మెప్పించిన తమన్నా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి చిత్రంలో నటించింది . ఈ మూవీలో అవంతిక పాత్రలో అభిమానులను ఆకట్టుకుంది .

అత్యాచారం అనే అభిప్రాయంపై తమన్నా వివరణ

తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన తమన్నా బాహుబలిలోని ఓ సీన్ ‌ గురించి స్పందించింది . ప్రభాస్ ‌.. తమన్నా మధ్య జరిగిన రొమాంటిక్ ఫైట్ సీన్ ‌ పై వచ్చిన అభ్యంతరాలపై క్లారిటీ ఇచ్చింది . ఈ సీన్ ‌ పై అప్పట్లో ఏకంగా ది రేప్ ఆఫ్ అవంతిక అనే టైటిల్స్ ‌ లో కథనాలు రావడంపై మిల్కీ బ్యూటీ మాట్లాడింది . ఇది తనపై జరిగిన అత్యాచారం కాదని .. ఒక పురుషుడిగా తనలోని మహిళతత్వాన్ని కనుగొన్న సీన్ ‌ అని చెప్పుకొచ్చింది . కానీ కొందరు అదే దృష్టితో ఆలోచించే వారికి ఈ విషయం అర్థం కాదని తెలిపింది .

సినిమా సన్నివేశాలకు విభిన్న అర్థాలు

తమన్నా మాట్లాడుతూ .. “ఎవరైనా ఆ సీన్ చెడుగా భావించేవారు నా శరీరాన్ని అదే కోణంలోనే చూస్తారు . ఎందుకంటే అది వారి దృక్పథం. ఒక చిత్రనిర్మాత మిమ్మల్ని చాలా అందమైన వ్యక్తిగా చూపించాలనుకుంటాడు . కానీ మీరేమో అందులో మరో అర్థాన్ని వెతుక్కుంటారు . అది అలాంటి వారి ఆలోచన. నేను ఇలాంటి వాటిని పట్టించుకోను . ఎందుకంటే ఒక సృజనాత్మక కలిగిన వ్యక్తిగా ఆ సీన్ ‌ అవంతికపై జరిగిన అత్యాచారమని నేను అనుకోను. అవంతికతో ఒక పురుషుడు కనుగొన్న అందంగానే భావిస్తా . ఇందులో ఓ యువకుడు ఆమె ఎంత అందంగా ఉందో చూపించడానికి ప్రయత్నించాడు ‘ అని తెలిపింది . ఇక సినిమాల విషయానికొస్తే తమన్నా ప్రస్తుతం సిద్ధార్థ్ మల్హోత్రా నటిస్తోన్న వ్వాన్: ఫోర్స్ ఆఫ్ ది ఫారెస్ట్‌లో కనిపించనుంది .

తమన్నా తన వ్యక్తిగత అభిప్రాయాన్ని తెలియజేస్తూ, సృజనాత్మకతను గౌరవించాలని పేర్కొంది. సినిమా సన్నివేశాలను విభిన్న కోణాలలో చూడటం సాధ్యమేనని ఆమె అభిప్రాయపడింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.