|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

మూడేళ్లుగా పరారీలో హీరోయిన్ మీరా మిథున్.. అరెస్ట్‌ చేయాలని కోర్టు సూచన

Published: 04-08-2025, 10:16 PM

తమిళ హీరోయిన్ మీరా మిథున్ దళితులపై చేసిన అనుచిత వ్యాఖ్యల కేసులో మూడేళ్లుగా పరారీలో ఉంది. ఈ కేసులో కోర్టు ఆమెను అరెస్టు చేయాలని ఆదేశించడంతో ఆమెను ఢిల్లీలో గుర్తించారు.

Key Points

1

తమిళ హీరోయిన్ మీరా మిథున్ మూడేళ్లుగా పరారీలో ఉన్నారు.

2

దళితులపై అనుచిత వ్యాఖ్యల కేసులో ఆమెపై అరెస్టు వారెంట్ జారీ అయింది.

3

కోర్టు ఆమెను అరెస్టు చేసి హాజరుపరచాలని పోలీసులను ఆదేశించింది.

4

ఢిల్లీలో ఆమెను గుర్తించి చెన్నై కోర్టుకు తరలించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

మీరా మిథున్ పై అరెస్టు వారెంట్

సినిమాలకంటే వివాదాలతో పాపులర్‌ అయిపోయింది తమిళ హీరోయిన్ మీరా మిథున్. ఎప్పుడూ ఏదో ఒక విషయంపై సంచలన వ్యాఖ్యలు చేస్తూ గతంలో వైరల్ ‌ అయ్యేది . . అయితే , ఆమెను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచాలని చెన్నై న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది . సుమారు మూడేళ్ల క్రితం దళితుల గురించి ఆమె చేసిన అనుచిత వ్యాఖ్యలు ఆ సమయంలో పెద్ద దుమారాన్నే రేపాయి . ఈ వివాదంలో ఆమెతో పాటు ఆమె స్నేహితుడు శ్యామ్‌ అభిషేక్‌పై చెన్నై పోలీసులు కేసు నమోదు చేసి 2022 లోనే అరెస్టు చేశారు . అయితే , బెయిల్ ‌ పై వారిద్దరూ బయటకు వచ్చేశారు . కేసు విచారణకు వారు సహకరించకపోవడంతో అరెస్ట్ ‌ వారెంట్ ‌ ఆ సమయంలోనే జారీ అయింది . ఇప్పటికే మూడేళ్లు అవుతున్నా ఆమె పరారీలోనే ఉండటంతో పోలీసులు గుర్తించలేకపోయారు .

ఢిల్లీ వీధుల్లో మీరా మిథున్ ‌ ఢిల్లీ వీధుల్లో తిరుగుతున్న తన కూతురు మీరా మిథున్ ‌ ను కాపాడాలని ఆమె తల్లి ఒక పిటిషన్ ‌ దాఖలు చేసింది . దీంతో ఆమె గురించి తెలిసింది . మీరా తల్లి పిటిషన్ ‌ పై విచారణ జరిపిన న్యాయస్థానం మీరాను రక్షించాలని పోలీసులను సూచించింది . దీంతో ఢిల్లీ పోలీసులు ఆమెను గుర్తించి అక్కడున్న హోంకి తరలించారు . అయితే , ఆమెను ఈనెల 11 న చెన్నై న్యాయస్థానంలో హజరుపరచాలని కోర్టు తెలిపింది . మీరా మిథున్ ‌ అనునిత్యం వివాదాలతోనే ఉంటుంది . ఆమె బిగ్ ‌ బాస్ ‌ లో ఉన్నప్పుడు ఆమెను అరెస్ట్ ‌ చేసేందుకు పోలీసులు వెళ్లారు . విశాల్ ‌, త్రిష , రజనీకాంత్ ‌, విజయ్ ‌ వంటి స్టార్స్ ‌ పై అనుచిత వ్యాఖ్యలు కూడా చేసింది .

మూడేళ్ల పరారీ తర్వాత గుర్తింపు

కోర్టు ఆదేశాల మేరకు అరెస్టు

కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు మీరా మిథున్‌ను అరెస్టు చేసి చెన్నై కోర్టులో హాజరుపరచే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ కేసు తదుపరి విచారణ కోసం ఎదురుచూస్తున్నారు.

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.