
తమిళ సినీ పరిశ్రమలో సంచలనం. ప్రముఖ హీరో శ్రీరామ్ డ్రగ్స్ కేసులో పట్టుబడ్డాడు. చెన్నై నార్కోటిక్స్ ఇంటెలిజెన్స్ అధికారులు అతన్ని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. మాజీ ఏఐడీఎంకే నేతతో సంబంధం ఉందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Key Points
తమిళ స్టార్ హీరో శ్రీరామ్ డ్రగ్స్ కేసులో అరెస్ట్
చెన్నై నార్కోటిక్స్ ఇంటలిజెన్స్ టీమ్ అదుపులోకి తీసుకోవడం
మరికొందరు తమిళ నటుల పేర్లు బయటకు వచ్చే అవకాశం
శ్రీరామ్ అరెస్టు
తమిళ మూవీ ఇండస్ట్రీలో సంచలనం చోటుచేసుకుంది. స్టార్ హీరో శ్రీరామ్ (Sri Ram) ఏకంగా డ్రగ్స్‌తో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. దీంతో అతడిని చెన్నై నార్కోటిక్స్ ఇంటలిజెన్స్ (Chennai Narcotics Intelligence) టీమ్ అదుపులోకి తీసుకుంది. ఈ మేరకు అతడి బ్లడ్ శాంపిల్స్ సేకరించి రిపోర్టుల కోసం ల్యాబ్‌కు పంపారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. శ్రీరామ్ మాజీ ఏఐడీఎంకే (AIDMK) నేత దగ్గర నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసినట్లుగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. డ్రగ్స్ పెడ్లర్ ప్రదీప్ ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఆయనను విచారిస్తున్నారు. ఇన్వెస్టిగేషన్‌లో భాగంగా మరికొందరు తమిళ నటుల పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ కేసులో పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు.
నార్కోటిక్స్ ఇంటెలిజెన్స్ దర్యాప్తు
మాజీ ఏఐడీఎంకే నేతతో సంబంధం
ఈ ఘటన తమిళ సినీ పరిశ్రమలో తీవ్ర కలకలం సృష్టించింది. దర్యాప్తులో మరిన్ని విషయాలు వెలుగులోకి రావచ్చు. ఇది సినీ ప్రముఖులకు ఒక హెచ్చరికగా నిలుస్తుంది.


