
ఓటీటీలో తమిళ థ్రిల్లర్ల ఆధిపత్యం కొనసాగుతోంది. ఇప్పుడు రెండు తమిళ థ్రిల్లర్లు, గెవి మరియు మాయకూతు, సన్ నెక్స్ట్ లో స్ట్రీమింగ్ అవుతున్నాయి. అద్భుతమైన IMDb రేటింగ్‌లతో, ఈ సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.
Key Points
సన్ నెక్స్ట్ లో రెండు తమిళ థ్రిల్లర్లు స్ట్రీమింగ్
గెవి: సర్వైవల్ థ్రిల్లర్, 9.2 IMDb రేటింగ్
మాయకూతు: ఫ్యాంటసీ క్రైమ్ థ్రిల్లర్, 9.6 IMDb రేటింగ్
రెండు సినిమాలు ఆగస్టు 27న విడుదలయ్యాయి
సన్ నెక్స్ట్ లో స్ట్రీమింగ్ అవుతున్న రెండు థ్రిల్లర్లు
ఓటీటీలో తెలుగు, తమిళం, మలయాళం అనే లాంగ్వేజ్ డిఫరెన్స్ లేదు. కంటెంట్ బాగుంటే ఏ భాషలోని సినిమా అయినా చూసేందుకు డిజిటల్ ఆడియన్స్ రెడీగా ఉంటున్నారు. ముఖ్యంగా థ్రిల్లర్లు ఏ భాషలోనివైనా అందరినీ అలరిస్తున్నాయి. ఇప్పుడు అలాంటి రెండు తమిళ థ్రిల్లర్లు ఓటీటీలో అదరగొడుతున్నాయి. ఇందులో ఒకటి సర్వైవల్ థ్రిల్లర్ ‘గెవి’ కాగా, మరొకటి ఫ్యాంటసీ క్రైమ్ థ్రిల్లర్ ‘మాయకూతు’.
తమిళ థ్రిల్లర్లు రెండు ఒకే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నాయి. సర్వైవల్ థ్రిల్లర్ గెవి, ఫ్యాంటసీ క్రైమ్ థ్రిల్లర్ మాయకూతు సన్ నెక్ట్స్ ఓటీటీ యాప్ లో స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఈ రెండు సినిమాలు ఆగస్టు 27నే ఓటీటీలో అడుగుపెట్టాయి. ఈ చిత్రాలకు ఐఎండీబీలో 9కి పైగా రేటింగ్ ఉండటం విశేషం. గెవి రేటింగ్ 9.2 కాగా.. మాయకూతు రేటింగ్ 9.6గా ఉంది. థియేటర్లలో ఈ రెండు సినిమాలు పాజిటివ్ రెస్పాన్స్ తో అదరగొట్టాయి. ఇప్పుడు ఓటీటీలో ట్రెండింగ్ లోకి వచ్చి సత్తాచాటుతున్నాయి.
గెవి: గ్రామీణ జీవితం, అణచివేత, మరియు తిరుగుబాటు
గెవి సినిమా కొడైకనాల్ దగ్గర్లో ఉన్న ఓ కుగ్రామం చుట్టూ తిరుగుతుంది. ఏ సౌకర్యాలు లేని, కనీస వసతులకు కూడా నోచుకుని ఆ గ్రామ ప్రజల కష్టాలను చూపించారు. అధికార బలం చేతిలో అణచివేతకు గురైన ప్రజలు తిరుగుబావుటా ఎగరవేస్తే ఎలా ఉంటుంది? హక్కుల కోసం పోరాడితే ఎలా ఉంటుందనే స్టోరీ లైన్ తో ఈ మూవీని తెరకెక్కించారు. ఈ సినిమాకు తమిళ్ దయాలన్ డైరెక్టర్.
గ్రామంలోని మంధరై, మలైయన్ దంపతుల కథ ప్రధానాంశంగా ఉంటుంది. ఈ సినిమాలో షీలా రాజ్ కుమార్, జాక్వెలిన్, ఆధవన్, వివేక్ మోహన్ తదితరులు నటించారు.
మాయకూతు: రచయిత, కథలు, మరియు నిజ జీవిత సమస్యలు
రచయితలు కథలు, నవలలు రాయడం సహజమే. కానీ ఆ కథల్లోని పాత్రలు రచయిత నిజ జీవితంలోకి సమస్యలతో వస్తే ఎలా ఉంటుందనే కథతో వచ్చిందే మాయకూతు. ఇందులో వాసన్ ఓ పాపులర్ రైటర్. కథలు రాస్తుంటాడు. వేర్వేరు అంశాలతో స్టోరీలు అల్లుతుంటాడు.
దొంగతనం చేయాలనుకునే పని మనిషి, మర్డర్లు చేసే గ్యాంగ్ స్టర్, మెడికల్ ఎడ్యుకేషన్ చదవాలనుకునే ఓ రైతు కూతురు.. ఇలా డిఫరెంట క్యారెక్టర్లు రచయిత నిజ జీవితంలోకి వస్తాయి. తమకు న్యాయం చేయమని అడుగుతాయి. ఈ క్రమంలో వచ్చే సస్పెన్స్ అదిరిపోతుంది. ఈ సినిమాకు ఏఆర్ రాఘవేంద్ర డైరెక్టర్. థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడే ఆడియన్స్ గెవి, మాయకూతును కచ్చితంగా ఎంజాయ్ చేస్తారు.
గెవి మరియు మాయకూతు సినిమాలు ఓటీటీలో అద్భుతమైన విజయాన్ని సాధించి, థ్రిల్లర్ ప్రేమికులను అలరిస్తున్నాయి. వేర్వేరు కథాంశాలతో ఆకట్టుకుంటున్న ఈ రెండు సినిమాలు తప్పకుండా చూడవలసినవి.


