|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్ న్యూస్: ‘ఓం శాంతి శాంతి శాంతిః’ లో చాలా మంది హీరోలున్నారట! తరుణ్ భాస్కర్ కామెంట్స్ వైరల్!

Published: 27-01-2026, 11:05 AM
షాకింగ్ న్యూస్: 'ఓం శాంతి శాంతి శాంతిః' లో చాలా మంది హీరోలున్నారట! తరుణ్ భాస్కర్ కామెంట్స్ వైరల్!
  • తరుణ్ భాస్కర్ హీరోగా ‘ఓం శాంతి శాంతి శాంతిః’ మూవీ జనవరి 30న గ్రాండ్ రిలీజ్!
  • ఈ సినిమాలో గోదావరి యాస అద్భుతంగా పలికిందని తెలిపిన తరుణ్ భాస్కర్.
  • నిర్మాతలే హీరోలని కొనియాడిన తరుణ్ భాస్కర్.. చిత్ర యూనిట్‌కు కృతజ్ఞతలు!
  • ఈ సినిమాలో చాలామంది హీరోలు ఉన్నారని తెలిపిన తరుణ్ భాస్కర్!

తరుణ్ భాస్కర్ హీరోగా నటించిన ‘ఓం శాంతి శాంతి శాంతిః’ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తరుణ్ భాస్కర్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఆ విశేషాలు ఏంటో చూద్దాం!

జనవరి 30న ‘ఓం శాంతి శాంతి శాంతిః’ విడుదల

మల్టీ ట్యాలెంటెడ్ తరుణ్ భాస్కర్ (Tarun Bhaskar)లీడ్ రోల్‌లో నటిస్తున్న హిలేరియస్ విలేజ్ కామెడీ ఎంటర్ టైనర్ ‘ఓం శాంతి శాంతి శాంతిః(Om Shanti Shanti Shanti). ఈషా రెబ్బా (Eesha Rebba)హీరోయిన్ గా నటిస్తుండగా.. A R సజీవ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఎస్ ఒరిజినల్స్, మూవీ వెర్స్ స్టూడియోస్ బ్యానర్స్ పై సృజన్ యరబోలు, ఆదిత్య పిట్టీ, వివేక్ కృష్ణని, అనుప్ చంద్రశేఖరన్, సాధిక్ షేక్, నవీన్ సనివరపు ఈ వెంచర్‌ను నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలై ప్రమోషనల్ కంటెంట్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఓం శాంతి శాంతి శాంతిః జనవరి 30న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఇందులో తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ.. ‘‘ఇందులో గోదారి యాస చక్కగా పలికాను.

దానికి కారణం తనే. రాత్రి నిద్రలో కూడా నాకు ఆ గోదారి యాస, ఆ ప్రాంతమే కలలోకి వచ్చేద( నవ్వుతూ) నందు చక్కని మాటలు రాశాడు. ఈ సినిమాకి చాలా మంది హీరోలు ఉన్నారు. అందరూ రిమేక్ అంటున్నారు. కానీ ఈ కథని ఒరిజినల్ గా ప్రజెంట్ చేయడానికి నిదర్శనమే ఆ పాట. జై క్రిష్ వజ్రం లాంటి సాంగ్ ఇచ్చాడు. ధీరజ్ బ్రహ్మాజీ గారు అందరూ కూడా పాత్రలో ఇమిడిపోయారు. ఈ నగరానికి ఏమైంది బాయ్స్ అందరికీ థాంక్ యూ. వాళ్ళకి షూటింగ్ అని చెప్పాను. అందుకే వచ్చారు (నవ్వుతూ) ఫ్యామిలీ అంతా కలిసి ఒక సినిమా చేసిన ఫీలింగ్ కలుగుతుంది. ఈ రోజుల్లో సినిమాలు నిర్మించడం చాలా కష్టమైన పని. ఏ సినిమా ఎప్పుడు ఆడుతుందో తెలీదు. ఇలాంటి సమయంలో ప్రొడ్యూసరే హీరో. ఈ మూవీ నిర్మాతలు అందరికీ హాట్సాఫ్. ఇంతమంది హీరోల మధ్యలో నేను చిన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ నే. అందరూ థియేటర్స్ లో వెళ్లి సినిమా చూడండి. చాలా ఎంజాయ్ చేస్తారు’’ అని అన్నాడు.

నిర్మాతలే హీరోలన్న తరుణ్ భాస్కర్

గోదావరి యాసలో అదరగొట్టిన తరుణ్

తరుణ్ భాస్కర్ సినిమా గురించి ఎన్నో విశేషాలు పంచుకున్నారు. ‘ఓం శాంతి శాంతి శాంతిః’ చిత్రం జనవరి 30న విడుదల కానుంది. మరిన్ని సినిమా అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.