|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

బిగ్ బాస్ తర్వాత తేజస్వి జీవితం తలకిందులు! అసలు నిజం బయటపెట్టిన నటి!!

Published: 27-03-2026, 2:05 AM
బిగ్ బాస్ తర్వాత తేజస్వి జీవితం తలకిందులు! అసలు నిజం బయటపెట్టిన నటి!!
  • తేజస్వి మదివాడ బిగ్ బాస్ వల్ల తన కెరీర్ నాశనమైందని వాపోయారు.
  • ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాతో ఆమె కెరీర్ ప్రారంభమైంది.
  • బిగ్ బాస్ తర్వాత తనపై నెగెటివిటీ ఏర్పడిందని తేజస్వి అన్నారు.
  • ప్రస్తుతం ఇంస్టాగ్రామ్ లో ఫోటోలతో, కాకమ్మ కథలకు హోస్ట్ గా ఆమె బిజీగా ఉన్నారు.

బిగ్ బాస్ షో తన కెరీర్‌ను నాశనం చేసిందని నటి తేజస్వి మదివాడ ఆవేదన వ్యక్తం చేసింది. ఒక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, బిగ్ బాస్ వల్ల తనపై నెగెటివిటీ ఏర్పడి అవకాశాలు తగ్గిపోయాయని తెలిపింది.

బిగ్ బాస్ పై తేజస్వి సంచలన వ్యాఖ్యలు

Tejaswi Madivada:బిగ్ బాస్.. వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షోగా గుర్తింపు తెచ్చుకున్న ఈ షో గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ముఖ్యంగా ఈ షోలో పాల్గొన్న ప్రతి ఒక్క కంటెస్టెంట్ కి ఊహించని పాపులారిటీ లభిస్తుంది అనడంలో సందేహం లేదు. అయితే ఈ పాపులారిటీ వచ్చినంత మాత్రాన వరుసగా అవకాశాలు రావాలన్న రూలేమీ లేదు. కొంతమందికి ఈ షో చేతినిండా ఛాన్సులు ఇస్తే మరికొంతమంది అవకాశాలు లేక కెరియర్ నాశనం చేసుకున్న వారు కూడా లేకపోలేదు. ఈ క్రమంలోనే బిగ్ బాస్ లోకి వెళ్లిన తర్వాత తన కెరియర్ మొత్తం నాశనమైపోయింది అంటూ ప్రముఖ నటి తేజస్వి మదివాడ (Tejaswi Madivada) చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న తేజస్వి మాట్లాడుతూ.. “విక్టరీ వెంకటేష్ , సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో వచ్చిన ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాతో నా తెలుగు సినిమా ప్రయాణం మొదలైంది. ఇందులో సమంత చెల్లిగా నటించి మంచి పేరే తెచ్చుకున్నాను ఆ తర్వాత కొన్ని చిత్రాలలో చేసాక నాకు బిగ్ బాస్ తెలుగు సీజన్ 2 లో పాల్గొనే అవకాశం లభించింది. అయితే ఈ షోకి వెళ్లి వచ్చిన తర్వాత నాకు అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి. ముఖ్యంగా ఈ షో వల్ల నాపై నెగెటివిటీ ఏర్పడింది. ఈ నెగెటివిటీ కారణంగా అప్పటివరకు ఉన్న క్రేజ్ కూడా పోయింది” అంటూ తేజస్వి ఆవేదన వ్యక్తం చేసింది. సినిమాల్లో మంచి భవిష్యత్తు ఉన్నప్పటికీ బిగ్ బాస్ వల్లే నష్టపోయానని ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. ఇక ప్రస్తుతం ఇంస్టాగ్రామ్ లో యాక్టివ్ గా ఉంటూ రోజుకు ఒక ఫోటో షూట్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న తేజస్వి.. కాకమ్మ కథలు షో కి హోస్టుగా వ్యవహరించిన విషయం తెలిసిందే.

కెరీర్ ఆరంభం మరియు బిగ్ బాస్ ప్రయాణం

ప్రస్తుతం తేజస్వి చేస్తున్న పనులు

ఇకపోతే తేజస్వి ఇండస్ట్రీకి రాకముందు ఏం చేసింది? అనే విషయానికి వస్తే హైదరాబాదులోని బేగంపేట ఎయిర్ఫోర్స్ కాలేజీలో చదువుకున్న ఈమె.. హైదరాబాద్ లోనే సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజ్ ఫర్ ఉమెన్ లో మాస్ కమ్యూనికేషన్, జర్నలిజంలో డిగ్రీ పట్టా అందుకుంది. ఆ తర్వాత ట్విస్ట్ ఎన్ టర్న్స్ లో ఫ్రీ లాన్స్ డాన్స్ ఇన్ స్ట్రక్టర్ గా పార్ట్ టైం జాబ్ చేసింది. ఆ తర్వాత హెచ్ ఎస్ బి సి , విప్రో, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ వంటి MNC లకు అలాగే నస్ర స్కూల్ ఫర్ గర్ల్స్ వంటి పాఠశాలలకు తరగతులు బోధించేది. ఇక అక్కడే పలు షార్ట్ ఫిలిమ్స్ లో నటించిన ఈమె.. ‘ధనం మూలం ఇదః జగత్’ అనే లఘు చిత్రం మంచి పేరు అందించింది. ఇక తర్వాత మిస్ డాబర్ గులాబరి 2011 అందాల పోటీలలో పాల్గొని రెండవ రన్నరప్ గా నిలిచింది. ఇక దీని ద్వారానే ఈమెకు సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో అవకాశం లభించింది.

మొత్తానికి తేజస్వి బిగ్ బాస్ తన జీవితాన్ని మార్చివేసిందని చెప్పడం గమనార్హం. ప్రస్తుతం ఆమె సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ, పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.