|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

తెలంగాణలో జనాభా లెక్కల విప్లవం! మే 11 నుంచి డిజిటల్ శకం, కులగణన కూడా!

Published: 09-04-2026, 5:35 AM
తెలంగాణలో జనాభా లెక్కల విప్లవం! మే 11 నుంచి డిజిటల్ శకం, కులగణన కూడా!
  • తెలంగాణలో మే 11 నుంచి జనాభా లెక్కింపు ప్రారంభం, పూర్తిగా డిజిటల్ విధానంలో.
  • 2011 తర్వాత మొదటిసారిగా డిజిటల్ పద్ధతిలో జనాభా సేకరణ.
  • జనాభా గణనలో కులగణన కూడా చేపట్టనున్నట్లు ప్రకటన.
  • ఏప్రిల్ 16 నుంచి సెల్ఫ్ ఎన్యూమరేషన్ పోర్టల్ ప్రజలకు అందుబాటులో ఉంటుంది.

తెలంగాణలో 2027 జనాభా లెక్కల సేకరణకు ప్రభుత్వం సిద్ధమైంది. మే 11 నుంచి డిజిటల్ విధానంలో లెక్కింపు మొదలు కానుంది. ఈసారి కులగణన కూడా చేపట్టనున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

తెలంగాణలో డిజిటల్ జనాభా లెక్కింపు ప్రారంభం

తెలంగాణలో 2027 జనాభా లెక్కల సేకరణ ప్రక్రియకు రంగం సిద్ధమైంది. మే 11వ తేదీ నుంచి ఈ ప్రక్రియ షురూ కానుంది. జూన్ 9, 2026 వరకు పూర్తిగా డిజిటల్ విధానంలో జరగనుంది. ఈ తరహా డిజిటల్ లెక్కింపు విధానం… దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో చేపట్టనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

2011 వరకు మాన్యూవల్(కాగితాలపై) విధానం ద్వారా జనాభా లెక్కింపు కొనసాగింది. అయితే ఈసారి అందుకు భిన్నంగా 2027 జనాభా లెక్కలను డిజిటల్ విధానంలో నిర్వహిస్తామని తెలంగాణ జనాభా లెక్కల కార్యకలాపాల డైరెక్టర్ భారతి హోలికేరి గురువారం తెలిపారు.

మొదటి దశ ప్రక్రియ మే 11 నుండి జూన్ 9 వరకు జరుగుతుందని ఆమె ప్రకటించారు. రెండవ దశ ఫిబ్రవరి 2027 లో జరుగుతుందని తెలిపారు. తెలంగాణల జరిగే ఈ జనాభా లెక్కింపులో ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లతో సహా 88,000 మంది సిబ్బంది పాల్గొంటారని ప్రకటించారు. సుమారు 93,000 నుంచి 94,000 మంది ఉద్యోగులు శిక్షణ పొందుతున్నారని వివరించారు.

“మునుపటి జనాభా గణనలతో పోలిస్తే ఇది చాలా ప్రత్యేకతను కలిగి ఉంది. మొదటిసారిగా డిజిటల్ మోడ్ లో లెక్కించబోతున్నాము. 2011 జనాభా లెక్కల వరకు గణనలు కాగితం ఆధారితంగా ఉండేవి. సెన్సస్ మేనేజ్ మెంట్ మానిటరింగ్ సిస్టమ్ (సీఎంఎంఎస్), సెల్ఫ్ ఎన్యూమరేషన్ పోర్టల్, హెచ్ ఎల్ వో యాప్ వంటి వివిధ డిజిటల్ సాధనాలు అందుబాటులో ఉన్నాయి. వీటి ద్వారా ప్రతి ఇంటి నుంచి డేటాను సంగ్రహించడానికి ఎన్యూమరేటర్లు ఉంటారు” అని భారతి హోలికేరి తెలిపారు.

డిజిటల్ విధానంలో సేకరించబోయే డేటా అత్యంత సురక్షింతగా ఉండనుంది. డేటా అప్లోడ్ అయిన వెంటనే…. అది ఎన్యూమరేటర్ల పరికరాల నుంచి సెంట్రల్ సర్వర్లలోకి వెళ్లిపోతుంది. ఎలాంటి అనుమానాలకు అవకాశం ఉండదని భారతి హోలికేరి స్పష్టం చేశారు.

కులగణనపై ప్రభుత్వం ప్రకటన

జనాభా గణనలో భాగంగా నిర్వహించబోయే కులగణనపై కూడా భారతి హోలికేరీ స్పందించారు. మొదటి దశలో ఇంటి పెద్ద (ఎస్సీ, ఎస్టీ, ఇతరులు) పేరు, కులం సేకరిస్తామన్నారు. రెండవ దశలో ఇతర సభ్యుల కుల వివరాలను సేకరిస్తామని తెలిపారు.

జనాభా లెక్కల సమయంలో అడగాల్సిన ప్రశ్నల సంఖ్యపై ఆమె మాట్లాడుతూ…. మొదటి దశ షెడ్యూల్ ను కేంద్రం ఇప్పటికే నోటిఫై చేసిందని గుర్తు చేశారు. దేశవ్యాప్తంగా ఏకరీతిగా ఉన్న 33 ప్రశ్నలు అడుగుతామని ఆమె చెప్పారు.

ఏప్రిల్ 16 నుంచి మే 10 వరకు తెలంగాణ ప్రజలకు సెల్ఫ్ ఎన్యూమరేషన్ పోర్టల్ అందుబాటులో ఉంటుంది. పోర్టల్ చాలా యూజర్ ఫ్రెండ్లీ డిజిటల్ టూల్. ఇంటి సందర్శన సమయంలో పోర్టల్ లో పూర్తి చేసిన డేటాను ఎన్యూమరేటర్ లు ధృువీకరిస్తారు. పౌరుల కోసం హెల్ప్ లైన్ అందుబాటులోకి వస్తుంది.

మొదటి దశ జనాభా గణన 2026 మే 11న ప్రారంభమై జూన్ 9 వరకు కొనసాగుతుంది. రెండో దశ 2027 ఫిబ్రవరిలో జరుగుతుంది.

సెల్ఫ్ ఎన్యూమరేషన్ పోర్టల్ వివరాలు

ప్రజలు తమకు తాముగా నిర్ణీత పోర్టల్‌లో కుటుంబ వివరాలను నమోదు చేసుకోవడాన్ని సెల్ఫ్ ఎన్యూమరేషన్ అంటారు. ఇది ఏప్రిల్ 16 నుంచి మే 10 వరకు అందుబాటులో ఉంటుంది.

కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం మొత్తం 33 రకాల ప్రశ్నలను ఎన్యూమరేటర్లు అడుగుతారు. ఇవి దేశవ్యాప్తంగా అందరికీ ఒకేలా ఉంటాయి.

అవును. మొదటి దశలో ఇంటి పెద్ద కుల వివరాలను, రెండో దశలో కుటుంబ సభ్యులందరి కుల వివరాలను సేకరిస్తారు.

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 – 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన ‘లాంగ్వేజేస్ జర్నో’ అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు. Read More

2027 జనాభా లెక్కలు తెలంగాణ రాష్ట్రానికి ఒక మైలురాయి కానున్నాయి. డిజిటల్ విధానం ద్వారా పారదర్శకంగా, కచ్చితత్వంతో గణాంకాలు సేకరించనున్నారు. ప్రజలు ఈ ప్రక్రియకు సహకరించాలని కోరారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.