|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

తెలంగాణ ఉద్యమ జర్నలిస్టులకు న్యాయం కావాలి – కోదండరాంకు టీజేఎఫ్ వినతి

Published: 13-07-2026, 3:48 PM
తెలంగాణ ఉద్యమ జర్నలిస్టులకు న్యాయం కావాలి - కోదండరాంకు టీజేఎఫ్ వినతి

తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన జర్నలిస్టులకు గుర్తింపు ఇవ్వాలని తెలంగాణ జర్నలిస్టుల ఫోరం (TJF) కోదండరాంకు వినతిపత్రం అందజేసింది. సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని డిమాండ్ చేశారు.

Key Points

1

తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టులకు గుర్తింపు ఇవ్వాలని TJF డిమాండ్

2

కోదండరాంకు వినతిపత్రం అందజేసిన టీజేఎఫ్ ప్రతినిధులు

4

ఈనెల 21న జర్నలిస్టులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు

జర్నలిస్టుల గుర్తింపు కోసం టీజేఎఫ్ డిమాండ్

తెలంగాణ స్వరాష్ట్ర సాధన ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన జర్నలిస్టులు, ఉద్యమకారులకు తగిన గుర్తింపు ఇవ్వాలని తెలంగాణ జర్నలిస్టుల ఫోరం (TJF) కోరింది. ఇందులో భాగంగా టీజేఎఫ్ ప్రతినిధులు… ప్రభుత్వం ఏర్పాటు చేసిన తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు, సంక్షేమ కమిటీ కో చైర్మన్, శాసనమండలి సభ్యులు (ఎమ్మెల్సీ) ప్రొఫెసర్ కోదండరాంను సోమవారం కలిశారు. ఉద్యమకారుల గుర్తింపు, సంక్షేమానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు.

టీజేఎఫ్ అధ్యక్షుడు పల్లె రవికుమార్ నేతృత్వంలోని కమిటీ కార్యవర్గ సభ్యులు ఈ భేటీలో పాల్గొని…. జర్నలిస్టుల, ఉద్యమకారుల సమస్యలపై సమగ్ర ప్రతిపాదనలతో కూడిన వినతి పత్రాన్ని కోదండరాంకు అందజేశారు. ఈ సమావేశం సందర్భంగా తెలంగాణ మలిదశ ఉద్యమ కాలం నాటి క్షేత్రస్థాయి పరిస్థితులను ఫోరం ప్రతినిధులు కో చైర్మన్ దృష్టికి తీసుకెళ్లారు. స్వరాష్ట్ర సాధన కోసం సాగిన పోరాటంలో జర్నలిస్టులు, ఉద్యమకారులు ప్రాణాలను సైతం లెక్కచేయకుండా అంకితభావంతో పనిచేశారని గుర్తుచేశారు. నాడు వారు పోషించిన అద్భుతమైన పాత్రను, ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం పరంగా వారికి అందాల్సిన సంక్షేమ కార్యక్రమాల ఆవశ్యకతను కోదండరాంకు వివరించారు.

కోదండరాంతో టీజేఎఫ్ ప్రతినిధుల భేటీ

స్వరాష్ట్రం కోసం పోరాడిన ప్రతి ఒక్క ఉద్యమకారుడిని, జర్నలిస్టును ప్రభుత్వ పరంగా తగిన రీతిలో గుర్తించాల్సిన బాధ్యత ఉందని ఫోరం ప్రతినిధులు స్పష్టం చేశారు. అర్హులైన జర్నలిస్టులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని… అలాగే వారి కుటుంబాలకు సామాజిక, ఆర్థిక భద్రత కల్పించేలా కమిటీ ద్వారా ప్రభుత్వానికి బలమైన సిఫార్సులు చేయాలని కోరారు. జర్నలిస్టులకు ఇళ్లు, ఆరోగ్య భద్రత, ఇతర పెండింగ్ సమస్యలపై ప్రొఫెసర్ కోదండరాంతో ఫోరం ప్రతినిధులు కూలంకషంగా చర్చించారు.

టీజేఎఫ్ ప్రతినిధులు అందజేసిన లేఖలోని అంశాలను పరిశీలించిన కోదండరామ్… పలు అంశాలపై సానుకూలంగా స్పందించారు. ఈనెల 21న జర్నలిస్టులతో ప్రత్యేకంగా సమావేశం కూడా ఏర్పాటు చేశామని చెప్పారు. వీలైనంత త్వరగా ప్రభుత్వానికి కమిటీ తరపున సిఫార్సులు అందజేస్తామన్నారు.

సంక్షేమ పథకాలపై చర్చలు

ఈ కార్యక్రమంలో తెలంగాణ జర్నలిస్టుల ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేకల క్రిష్ణ, ఫోరం కార్యదర్శులు ముద్ధం స్వామి, పాలకూరి రాజు, మనం శ్రీనివాస్, పోగుల ప్రకాష్, ఎక్కులూరి నాగార్జున్ రెడ్డి తదితరులు పాల్గొని తమ డిమాండ్లను కో చైర్మన్ ముందుంచారు.

జర్నలిస్టుల సమస్యలపై కోదండరాం సానుకూలంగా స్పందించడం ఆశాజనకం. ఈనెల 21న జరిగే సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోవాలని ఆశిద్దాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.