
📌 Key Points
- పెట్రోల్, డీజిల్ కొరత వార్తలు అవాస్తవం: తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్.
- కంపెనీల వద్ద తగినంత నిల్వలు ఉన్నాయి, సరఫరా గొలుసు ఆగలేదు.
- అనవసర భయంతో కొనుగోళ్లు పెరగడం వల్ల కొన్ని బంకుల్లో తాత్కాలిక కొరత ఏర్పడవచ్చు.
- డబ్బాల్లో నిల్వ చేయడం నిబంధనలకు విరుద్ధం, ప్రమాదకరం అని హెచ్చరిక.
తెలంగాణలో పెట్రోల్, డీజిల్ కొరత ఉందనే వార్తలపై పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ స్పందించింది. రాష్ట్రంలో ఇంధన కొరత లేదని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపింది. తగినంత నిల్వలు ఉన్నాయని స్పష్టం చేసింది.
పెట్రోల్ కొరతపై డీలర్స్ అసోసియేషన్ ప్రకటన
రాష్ట్రవ్యాప్తంగా పెట్రోల్ బంకుల వద్ద వాహనదారుల ఆందోళన నేపథ్యంలో తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ స్పందించింది. పెట్రోల్, డీజిల్ కొరత ఉందన్న వదంతులు పూర్తిగా అవాస్తవమని కొట్టిపారేసింది. ఇంధన కొరత ఉందనేది కేవలం తప్పుడు వార్త అని తెలిపింది. ప్రజలు అనవసరంగా బంకుల వద్ద క్యూ కడుతున్నారని అభిప్రాయపడింది.
ప్రస్తుతం HPCL , IOCL, BPCL వంటి కంపెనీల వద్ద తగినంత నిల్వలు ఉన్నాయని తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ క్లారిటీ ఇచ్చింది. సరఫరా గొలుసు (Supply chain) ఎక్కడా ఆగలేదని పేర్కొంది. అనవసరం భయం వల్ల ప్రజలు ఒక్కసారిగా కొనుగోలు చేయడం వల్ల సాధారణం కంటే 2.5 నుండి 3 రేట్లు విక్రయాలు పెరిగాయని వివరించింది. దీనివల్ల కొన్ని బంకుల్లో తాత్కాలికంగా స్టాక్ అయిపోవచ్చు…. కానీ అది కొరత కాదని స్పష్టం చేసింది.
నిల్వలు, సరఫరా గురించి స్పష్టత
” పెట్రోల్ లేదా డీజిల్‌ను డబ్బాల్లో, క్యాన్లలో నింపి నిల్వ చేయడం PESO(Petroleum and Explosives Safety Organisation) నిబంధనలకు విరుద్ధం. ఇది చాలా ప్రమాదకరం మరియు అగ్ని ప్రమాదాలకు దారి తీయవచ్చు. ప్రజలు తమకు అవసరమైనంత మేరకే ఇంధనాన్ని కొనుగోలు చేయాలి. అనవసరంగా నిల్వ చేయవద్దు. తప్పుడు వార్తలను నమ్మకండి.. ప్రచారం చేయకండి. బాధ్యతాయుతంగా వ్యవహరించండి”తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ కోరింది.
ప్రజలకు సూచనలు, హెచ్చరికలు
మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 – 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన ‘లాంగ్వేజేస్ జర్నో’ అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు. Read More
కాబట్టి, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. నిల్వలు సరిపడా ఉన్నాయి. వదంతులు నమ్మి ఇబ్బందులు కొని తెచ్చుకోవద్దు. బాధ్యతగా వ్యవహరించాలని అసోసియేషన్ కోరింది.


