
📌 Key Points
- తెలంగాణలో రెండో వాహన రిజిస్ట్రేషన్ పై 2% అదనపు పన్ను రద్దు
- కొత్త విధానం ఈ నెల 23 నుంచి అమలులోకి రానుంది
- కుటుంబ సభ్యుల పేర్లపై వాహనాల రిజిస్ట్రేషన్లను నివారించడమే లక్ష్యం
- కేంద్ర ప్రభుత్వ ‘వాహన్’ పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్లు
తెలంగాణ ప్రభుత్వం వాహనదారులకు శుభవార్త అందించింది. రాష్ట్రంలో రెండో వాహనం రిజిస్ట్రేషన్ పై ఉన్న 2 శాతం అదనపు పన్నును రద్దు చేసింది. ఈ నిర్ణయం ఈ నెల 23 నుంచి అమలులోకి రానుంది.
రెండో వాహనంపై పన్ను రద్దు నిర్ణయం!
రవాణాశాఖలో అనేక సంస్కరణలు తీసుకొచ్చే దిశగా అడుగులు వేస్తున్న తెలంగాణ ప్రభుత్వం… మరో కీలక నిర్ణయం తీసుకుంది. రెండో వాహనం రిజిస్ట్రేషన్ పై 2 శాతం అదనపు ట్యాక్స్‌ను రద్దు చేయనుంది. ఈ మేరకు రాష్ట్ర రవాణాశాఖ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం ఈ నెల 23వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందని ప్రకటించింది.
ఈ ట్యాక్స్ రద్దు చేయటానికి ప్రత్యేకంగా కొన్ని కారణాలు ఉన్నాయి. చాలా మంది వాహనదారులు ఈ ట్యాక్స్ ను తప్పించుకునేందుకు వారి ఇంట్లోని కుటుంబ సభ్యుల పేర్లపై వాహనాలను రిజిస్ట్రేషన్ చేయిస్తున్నారు. తరువాత బీమా క్లెయిమ్‌ల సమయంలో యాజమాన్య సమస్యలు తలెత్తుతున్నాయి. ఇదిలా ఉంటే ఇక రాష్ట్ర రాష్ట్రంలో జరిగే రిజిస్ట్రేషన్లు కేంద్ర ప్రభుత్వ ‘వాహన్’ పోర్టల్ ద్వారా జరగనున్నాయి. రిజిస్ట్రేషన్ అయ్యే ప్రతి వాహనం కూడా వాహన్‌తో అనుసంధానమవుతుంది. ఈ సరికొత్త విధానం ఈనెల 23వ తేదీ నుంచే అమలు కానుంది. ఈ రెండు కారణాలతో…. ఈ ట్యాక్స్ ను రద్దు చేయాలని సర్కార్ నిర్ణయించింది.
‘వాహన్’ పోర్టల్‌తో అనుసంధానం
జాతీయ డిజిటల్ ప్లాట్‌ఫామ్ “వాహన్”లో రెండో వాహనం గుర్తించే ప్రత్యేక ఆప్షన్ కూడా లేదు. ఇది కూడా ఇబ్బందిగా మారింది. పైగా ఇతర రాష్ట్రాల్లో ఈ తరహా పన్ను లేవని ప్రభుత్వానికి నివేదికలు అందాయి. వీటన్నింటిని విశ్లేషించిన ప్రభుత్వం…. ఈ పన్నును పూర్తిగా ఎత్తివేయాలనే నిర్ణయానికి వచ్చింది. అంటే వాహన్ తో అనుసంధానం వల్ల రెండో వాహనం కొనుగోలు చేసే వారికి ఖర్చు తగ్గడంతో పాటు రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా కాస్త సులభమవుతుంది.
వాహనదారులకు రిజిస్ట్రేషన్ సులభతరం!
గత కొంత కాలంగా రవాణా శాఖలో తీసుకువస్తున్న కొత్త సంస్కరణల అమలు నేపథ్యంలో ఆర్టీవో కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్, క్యూ లైన్‌లో వెయిటింగ్, కార్డు కోసం తిప్పలు తప్పినట్లు అయింది. తాజాగా రెండో వాహనంపై వించే లైఫ్ ట్యాక్స్ రద్దు నిర్ణయంపై వాహనదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఈ నిర్ణయం వాహనదారులకు మరింత ప్రయోజనకరంగా ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ సులభతరం కావడంతో పాటు అదనపు భారం కూడా తగ్గనుంది.


