|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

స‌డెన్‌గా ఓటీటీలోకి వ‌చ్చిన తెలుగు హార‌ర్ మూవీ డీమన్ – క‌ల‌లోకి వ‌చ్చి భ‌య‌పెట్టే ద‌య్యం – స్ట్రీమింగ్ ఎందులో అంటే?

Published: 29-05-2025, 1:46 AM
స‌డెన్‌గా ఓటీటీలోకి వ‌చ్చిన తెలుగు హార‌ర్ మూవీ డీమన్ - క‌ల‌లోకి వ‌చ్చి భ‌య‌పెట్టే ద‌య్యం - స్ట్రీమింగ్ ఎందులో అంటే?

తెలుగు హారర్ ప్రేమికులకు గుడ్ న్యూస్! ‘డీమన్’ అనే హారర్ మూవీ ఆహా ఓటీటీలో విడుదలైంది. సచిన్ మణి, అబర్నతి నటించిన ఈ సినిమా సైకలాజికల్ హారర్ డ్రామాగా ప్రేక్షకులను భయపెడుతుందని చెబుతున్నారు.

Key Points

1

ఆహా ఓటీటీలో డైరెక్ట్ గా రిలీజైన తెలుగు హారర్ మూవీ డీమన్.

2

సైకలాజికల్ హారర్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా ట్విస్టులతో ఆకట్టుకుంది.

4

క్లైమాక్స్ ట్విస్ట్ ప్రేక్షకులను ఆకట్టుకున్నట్లుగా విమర్శలు వచ్చాయి.

డీమన్ మూవీ కథాంశం

తెలుగు హార‌ర్ మూవీ డీమ‌న్ థియేట‌ర్ల‌ను స్కిప్ చేస్తూ డైరెక్ట్‌గా గురువారం ఆహా ఓటీటీలో రిలీజైంది. స‌చిన్ మ‌ణి, అబ‌ర్న‌తి హీరోహీరోయిన్లుగా న‌టించిన ఈ హార‌ర్ మూవీలో సురుతి పేరియసామి, కుంకి అశ్విన్, రవీనా కీలక పాత్రలు పోషించారు. ర‌మేష్ ప‌ళ‌నీవేల్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

2023 సెప్టెంబ‌ర్‌లో త‌మిళం లో ఈ మూవీ రిలీజైంది. దాదాపు ఏడాదిన్న‌ర త‌ర్వాత తెలుగు ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. సైక‌లాజిక‌ల్ హార‌ర్ డ్రామాగా తెర‌కెక్కిన ఈ మూవీ ట్విస్ట్‌లు, ట‌ర్న్‌ల‌తో ప్రేక్ష‌కుల‌ను మెప్పించింది. రోనీ రాఫెల్ ఈ సినిమాకు మ్యూజిక్ అందించాడు.

నటీనటులు మరియు సాంకేతిక నిపుణులు

విఘ్నేష్ శివ‌న్ ఓ సినిమా డైరెక్ట‌ర్‌. తాను తీయ‌బోతున్న హార‌ర్ మూవీ కోసం క‌థ రాసే ప్ర‌య‌త్నాల్లో ఉంటాడు. ఎలాంటి డిస్ట్ర‌బెన్స్ లేకుండా క‌థ రాసుకోవ‌డానికి సిటీ మ‌ధ్య‌లో ఉన్న కొత్త బంగ‌ళాకు షిప్ట్ అవుతాడు. ఆ బిల్డింగ్‌లో నిద్ర‌పోయిన త‌ర్వాత విఘ్నేష్ శివ‌న్‌కు విచిత్ర‌మైన క‌ల‌లు వ‌స్తుంటాయి. ఓ ద‌య్యం అత‌డిని చంప‌డానికి చూస్తుంది. నిజంగానే బిల్డింగ్‌లో ద‌య్యం ఉందా? ఆ బిల్డింగ్ మిస్ట‌రీని విఘ్నేష్ శివ‌న్ ఎలా ఛేదించాడు? విఘ్నేష్ ప్రేమించిన కార్తీక‌కు, ఆ ద‌య్యానికి ఉన్న సంబంధం ఏమిటి? విఘ్నేష్ డైరెక్ట‌ర్ అయ్యాడా? లేదా? అన్న‌దే డీమ‌న్ మూవీ క‌థ‌.

కాన్సెప్ట్ బాగున్నా…బిల్డింగ్ మిస్ట‌రీ రివీల్ చేయ‌డానికి డైరెక్ట‌ర్ ఎక్కువ‌గా టైమ్ తీసుకోవ‌డం, ద‌య్యం ఫ్లాష్‌బ్యాక్ లో ఆస‌క్తి లోపించ‌డంపై విమ‌ర్శ‌లు వినిపించాయి. చిన్న చిన్న లోపాలున్న హార‌ర్ ఎలిమెంట్స్‌తో ఆడియెన్స్‌ను భ‌య‌పెట్టాడు డైరెక్ట‌ర్‌. ముఖ్యంగా క్లైమాక్స్ ట్విస్ట్ బాగుందంటూ కామెంట్స్ వినిపించాయి.

విమర్శకుల అభిప్రాయాలు

డీమ‌న్ హీరో స‌చిన్ మ‌ణి త‌మిళంలో దళపతి విజయ్ లియోలో ఓ కీల‌క పాత్ర‌లో క‌నిపించాడు. హీరోయిన్ అబ‌ర్న‌తి త‌మిళంలో ఇర‌గ‌ప‌ట్రు, మాయాపుథ‌గంతో పాటు మ‌రికొన్ని సినిమాలు చేసింది.

ఈ వారం ఓటీటీలోకి డీమ‌న్‌తో పాటు నాని హిట్ 3 , సూర్య రెట్రోతో పాటు మ‌రికొన్ని బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీస్ రిలీజ‌య్యాయి. ఈ రెండు సినిమాలు నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ కావ‌డం గ‌మ‌నార్హం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.