ఎన్టీఆర్ దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అనుకున్న దానికంటే ఎక్కువ మంది రావడంతో క్యాన్సిల్ చేసిన విషయం తెలిసిందే. పాసుల ఉన్న వారి కంటే పాసులు లేని వాళ్ళు వేలాదిగా తరలి రావడంతో బారికేడ్లు కూడా తోసుకుని వెళ్లి నోవాటెల్ హోటల్ అద్దాలను బ్రేక్ చేసి .. కుర్చీలు విరగ్గొట్టి రచ్చ రచ్చ చేసారు. దీంతో వెంటనే ప్రీ రిలీజ్ ఈవెంట్ ను రద్దు చేసారు. పోలీసులపై కూడా పెద్ద పెద్దగా అరుస్తూ కేకలు వేశారు. ఎన్టీఆర్ అభిమానులు చేసిన గొడవకి ఆ పేరున్న హోటల్ కి భారీగా నష్టమొచ్చింది. ఇప్పుడు లబో దిబో అంటూ వారి గోడును ఎవరికీ చెప్పుకోవాలో కూడా అర్ధం కావడం లేదు.
తెలిసిన సమాచారం ప్రకారం హోటల్ లో మెయిన్ ఎంట్రన్స్ గ్లాస్ పగలగొట్టడం, డోర్లు విరగ్గొట్టడం, ఖరీదైన కుర్చీలను బ్రేక్ చేయడం, అనేక కర్టెన్స్ నాశనం చేయడం చేసారు. మొత్తానికి రూ. 33 లక్షల డ్యామేజీ అయిందని సమాచారం. ఒక్క కుర్చీల వరకే 7 లక్షల డ్యామేజీ జరిగిందని తెలిసింది. హోటల్ యాజమాన్యం జరిగిన నష్టాన్ని బిల్లుని పంపించాల్సిన పంపించారని సినీ వర్గాల వారు చెబుతున్నారు.
ఎన్టీఆర్ ఫ్యాన్స్ చేసిన డ్యామేజీకి బిల్లు ఎవరు కడతారో చూడాలి .. సాధారణంగా నిర్మాతలపైనే ఈ భారం పడుతుంది లేక ఈవెంట్ మేనేజర్స్ కడుతారో చూడాలి. మొత్తానికి, ఎవరో తప్పు చేస్తే ఇంకొకరు బలవుతున్నారు.