బండి సంజయ్‌: కేసీఆర్‌ రీ ఎంట్రీ ఇక కలగానే మిగిలిపోతుంది

లోక్‌ సభలో ప్రతిపక్షనేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్‌ గాంధీపై బీజేపీ మంత్రి బండి సంజయ్‌ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ క్విట్ ఇండియా అని వ్యాఖ్యానించారు. ఆయన బుధవారం శేరిలింగంపల్లి బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొని హాట్‌  కామెంట్లు చేశారు.

‘‘రాహుల్ గాంధీ.. క్విట్ ఇండియా. విదేశాలకు వెళ్లి భారత ఎన్నికల వ్యవస్థను విమర్శిస్తావా?. రిజర్వేషన్లపై నోటికొచ్చినట్లు మాట్లాడతావా?. కేసీఆర్ కుటుంబాన్ని జైల్లో వేయడం సీఎం రేవంత్‌కు సాధ్యం కావడం లేదు. కేసీఆర్ ఢిలీ వెళ్లి కాంగ్రెస్ పెద్దలతో మాట్లాడుకుని వచ్చారు. బీజేపీ అధికారంలోకి వస్తే కేసీఆర్ అంతు చూసేటోళ్లం. అంకుశం సినిమాలో రాంరెడ్డికి పట్టిన గతే కేసీఆర్ కుటుంబానికి పట్టేది. కేసీఆరే దశమ గ్రహం.. నవగ్రహాలు చేయడం విడ్డూరం. వరదలతో జనం అల్లాడుతుంటే కేసీఆర్ ఎందుకు బయటకు రావడం లేదు?. ప్రజలు కేసీఆర్ కు ‘నో ఎంట్రీ బోర్డు’పెట్టేశారు. ఇగ రీ ఎంట్రీ కలే. ఆరు గ్యారంటీలపై డైవర్ట్ చేసేందుకే హైడ్రా పేరుతో ‘హైడ్రామా’లాడుతున్నారు.

దేశ ప్రజలారా.. కాంగ్రెస్ ముక్త్ భారత్ లక్ష్యంగా ముందుకు సాగండి. అత్యధిక సభ్యత్వం నమోదు చేసిన డివిజన్ కార్యకర్తలను నేను సన్మానిస్తా. ఈసారి జీహెచ్ఎంసీ మేయర్ బీజేపీదే. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో  కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం కలిసి పోటీ చేయడం తథ్యం. లౌకికవాదులారా.. జైనూర్ ఘటనపై నోరెందుకు మెదపడం లేదు?. హిందూ పండుగలపై ఆంక్షలు పెడుతుంటే ఎందుకు స్పందించరు?. జరుగుతున్న అన్యాయంపై ప్రశ్నించని వాళ్లు నా దృష్టిలో భారతీయులే కాదు’ అని అన్నారు.

See also  TG Vishwa Prasad Blames Director Harish Shankar for the Failure of Mr Bachchan

Related Posts

Controversy Over Pawan Kalyan’s Children’s Religious Affiliation

Share this… Facebook Twitter Whatsapp Linkedin Pawan Kalyan’s Struggle to Uphold…

Read more

Top 10 latest Telugu news highlights:

Share this… Facebook Twitter Whatsapp Linkedin Top 10 latest Telugu news…

Read more

You Missed

Laughs Guaranteed: Gopichand’s New Film ‘Viswam’ Hits Theaters October 11

  • October 7, 2024
Laughs Guaranteed: Gopichand’s New Film ‘Viswam’ Hits Theaters October 11

Vardhan Puri, Grandson of Amrish Puri, Creates Buzz in Hyderabad – Tollywood Entry Soon?

  • October 7, 2024
Vardhan Puri, Grandson of Amrish Puri, Creates Buzz in Hyderabad – Tollywood Entry Soon?

Mahesh Babu’s Stylish Airport Look Adds Fuel to #SSMB29 Speculations

  • October 7, 2024
Mahesh Babu’s Stylish Airport Look Adds Fuel to #SSMB29 Speculations

Bigg Boss 18: Shilpa Shirodkar Avoids Speaking About Mahesh Babu and Namrata Shirodkar

  • October 7, 2024
Bigg Boss 18: Shilpa Shirodkar Avoids Speaking About Mahesh Babu and Namrata Shirodkar

ఓటీటీలో ‘గొర్రె పురాణం’

  • October 7, 2024
ఓటీటీలో ‘గొర్రె పురాణం’

మా అమ్మ మళ్లీ చనిపోయింది- రాజేంద్రప్రసాద్ భావోద్వేగం

  • October 7, 2024
మా అమ్మ మళ్లీ చనిపోయింది- రాజేంద్రప్రసాద్ భావోద్వేగం