హైదరాబాద్‌లోని హుసేన్ సాగర్ చుట్టూ స్కైవాక్ వే నిర్మిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో బౌద్ధ పర్యాటక స్థలాలను అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. నాగార్జున సాగర్ బుద్ధవనంలో అంతర్జాతీయ మ్యూజియం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
బ్యాక్ వాటర్ వరకు బోటింగ్‌ను పునరుద్ధరించాలని నిర్ణయించింది. హుస్సేన్ సాగర్ చుట్టూ స్కైవాక్ వే ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. హైదరాబాద్ – నాగార్జున సాగర్ మధ్య నాలుగు లైన్ల రోడ్డును నిర్మించాలని ప్రతిపాదించారు.