నటి అమీ జాక్సన్ మరియు హాలీవుడ్ నటుడు ఎడ్ వెస్ట్‌విక్ ఇటలీలో ఘనంగా వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లి వేడుక అమాల్ఫి కోస్ట్ వద్ద కుటుంబసభ్యులు, సన్నిహితుల మధ్య ఘనంగా జరిగింది. సోషల్ మీడియా ద్వారా ఈ జంట తమ వెడ్డింగ్ ఫోటోలు పంచుకొని, “కొత్త ప్రయాణం ఇప్పుడే మొదలైంది” అని తెలిపారు. కొంతకాలంగా ప్రేమలో ఉన్న ఈ జంట, ఎట్టకేలకు పెళ్లి చేసుకున్నారు.
అమీ జాక్సన్, జార్జ్ పనియోటౌ అనే వ్యాపారవేత్తతో గతంలో సహజీవనం చేస్తూ, ఆండ్రూ అనే బిడ్డకు తల్లిదండ్రులు అయిన విషయం తెలిసిందే. 2020లో ఈ జంట వివాహం చేసుకోవాలని భావించారు, కానీ కరోనా మహమ్మారి కారణంగా వివాహం వాయిదా పడింది. ఆ తర్వాత ఇద్దరి మధ్య విభేదాలు వచ్చి, వారిద్దరూ విడిపోవాల్సి వచ్చింది.
సౌదీ అరేబియాలో జరిగిన ఓ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఎడ్ వెస్ట్‌విక్‌ను తొలిసారి కలిసిన అమీ, అప్పటి నుండే వీరి మధ్య పరిచయం పెరిగి ప్రేమగా మారింది. ఆ ప్రేమ ఎట్టకేలకు వివాహం వరకు చేరింది.
అమీ జాక్సన్, తెలుగు ప్రేక్షకులకు “ఎవడు,” “ఐ,” మరియు “2.ఓ” వంటి సినిమాల ద్వారా సుపరిచితురాలు. ఆమె నటించిన తాజా సినిమాలు “మిషన్: ఛాప్టర్ 1” (తమిళ్) మరియు “క్రాక్” (హిందీ) ఇటీవల విడుదలయ్యాయి.