టాలీవుడ్ యంగ్ హీరో సుహాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన ‘కలర్ ఫొటో’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. ఈ మూవీ సూపర్ హిట్ కావడంతో సుహాస్ క్రేజ్ మరింత పెరిగింది. దీంతో ఆయన వరుస సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతున్నాడు. గ్యాప్ ఇవ్వకుండా బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్‌లు ఓకే చేస్తూ ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు. ఇటీవల ‘అంబాజీ పేట బ్యారేజ్’ బ్యాండ్ మూవీతో ప్రేక్షకులను అలరించాడు. ప్రజెంట్ సుహాస్ ‘జనక అయితే గనక’ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా సెప్టెంబర్ 13న గ్రాండ్ విడుదల కావాల్సి ఉండగా.. వర్షాలు, వరదల వల్ల వాయిదా పడింది. ఈ క్రమంలో.. తాజాగా, సుహాస్ నటిస్తున్న మరో కొత్త మూవీ విడుదల తేదీపై అధికారిక ప్రకటన విడుదల కావడంతో పాటు ఓ పోస్టర్‌ను మేకర్స్ వదిలారు. సుహాస్ హీరోగా, డైరెక్టర్ బాబీ కాంబోలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘గొర్రె పురాణం’. ఈ మూవీ ఫోకల్ వెంచర్స్ బ్యానర్‌పై ప్రవీణ్ రెడ్డి నిర్మాణంలో రాబోతుంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న గొర్రె పురాణం సినిమా సెప్టెంబర్ 20న గ్రాండ్ థియేటర్స్‌లో విడుదల కాబోతున్నట్లు మేకర్స్ తెలిపారు. “,
ప్రభాస్ కి తండ్రిగా మెగాస్టార్.. నిజమేనా..?
Share this… Facebook Twitter Whatsapp Linkedin ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ ముంబైలో…
Read more