టీడీపీ సీనియర్ నేత ఆనం వెంకటరమణారెడ్డి మరోసారి వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి ఆర్కే రోజాపై తీవ్ర విమర్శలు చేశారు. ఆనం, రోజాపై మాటల తూటాలు పేల్చుతూ, రోజా తీరుపై తీవ్రంగా మండిపడ్డారు. తను ఎప్పుడూ పనికిమాలిన మాటలు మాట్లాడుతూ, ప్రజాసేవను పక్కనబెట్టి, రాజకీయ ఆడంబరాలు చేసుకుంటుందని ఆందోళన వ్యక్తం చేశారు.
తిరుమలకు వెళ్లి, దైవదర్శనం సమయంలో కూడా రాజకీయాలు మాట్లాడుతుందనని ఆరోపణలు చేశారు. తన నాయకుడు నారా లోకేశ్ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తూ సహాయం అందిస్తుంటే, రోజా ఇటలీలో కూర్చుని రాజకీయ చర్చలు చేస్తున్నారని వ్యంగ్యంగా పేర్కొన్నారు
అంతేకాకుండా, నెల్లూరు మున్సిపల్ కార్పోరేషన్‌లో జరిగిన ఫోర్జరీ సంతకాల కుంభకోణం విషయంపై కూడా ఆనం తీవ్రంగా స్పందించారు. జిల్లా కలెక్టర్ ఆనంద్‌కి ఫిర్యాదు చేస్తూ, సీఐడీ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. సాక్షాలు సైతం అందజేసినట్లు చెప్పారు. కార్పోరేషన్‌లో అవినీతి ఓ పథకం ప్రకారమే జరుగుతోందని, దీనిపై అధికారులు దృష్టి సారించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.