హీరోయిన్ సమంత నాగచైతన్యతో విడాకులు తీసుకున్నప్పటి నుంచి మయోసైటీస్ వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా ఈ వ్యాధి కారణంగా ఆమె ఏడాది నుంచి సినిమాలకు దూరంగా ఉంటుంది. చికిత్స తీసుకుంటూ రెస్ట్ తీసుకుంటుంది. అయితే ఇటీవల సమంత ఓ పాడ్ కాస్ట్ మొదలెట్టి అందులో ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు తెలుపుతోంది.
అంతేకాకుండా పలు పోస్టులతో సోషల్ మీడియాలో రచ్చ చేస్తుంది. ఈ క్రమంలో ఫ్యాన్స్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వాలని కోరడంతో బంగారం మూవీ ప్రకటించింది. ఇక ఆ తర్వాత నుంచి సామ్ సినిమాల గురించి ఎలాంటి పోస్ట్ పెట్టలేదు. దీంతో ఫ్యాన్స్ సమంత మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చేటట్టు లేదని నిరాశలో ఉన్నారు.
ఈ నేపథ్యంలో.. తాజాగా, సామ్ తన అభిమానులకు ఓ గుడ్ న్యూస్ ప్రకటిస్తూ పోస్ట్ పెట్టింది. ‘‘కలలు కనడం ఎప్పుడూ ఆపవద్దు. కొంత కాలం తర్వాత మళ్లీ సినిమా సెట్స్‌పైకి రావడం ఆనందంగా ఉంది’’ అనే క్యాప్షన్ జత చేసి కాఫీ కప్ ఓ బుక్ ఉన్న పిక్ షేర్ చేసింది. ప్రస్తుతం సమంత పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. అది చూసిన సినీ ప్రముఖులు, అభిమానులు ఆమెకు ఆల్ ది బెస్ట్ తెలుపుతూ కామెంట్లు పెడుతున్నారు.