టాలీవుడ్‌లో లైంగిక వేధింపుల కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. హేమా కమిటీ పుణ్యమా అని ఇండస్ట్రీలో అమ్మాయిలు నోరు విప్పుతున్న విషయం తెల్సిందే. టాలీవుడ్‌లో జానీ మాస్టర్ కేసుతో మొదలైన ఈ వ్యవహారం, తరువాత తమను వేధించినవారిపై కేసు పెట్టడానికి ఇక్కడ పనిచేస్తున్న అమ్మాయిలు ధైర్యంగా బయటకు వస్తున్నారు. హీరో రాజ్ తరుణ్‌తో ప్రారంభమైంది, అనంతరం జానీ మాస్టర్‌తో ఈ అంశం మరింత ఉత్కంఠగా మారింది. ఆ తర్వాత యూట్యూబర్ హర్షసాయి కూడా చిక్కులో పడినట్లు సమాచారం.
ఇక వీరి లిస్ట్‌లో మరో స్టార్ కొరియోగ్రాఫర్ చేరాడు. ఈ స్టార్ కొరియోగ్రాఫర్ ఒక యువతిని వేధించడం, ఆమె ఇతగాడి వేధింపులు తట్టుకోలేక పోలీసుల వద్దకి వెళ్లాలనుకోవడం జరిగాయి. అయితే ఇక్కడ పెద్ద ట్విస్ట్ ఉంది. ఈ స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కంటే ఎక్కువ పేరు తెచ్చుకున్నాడు. తెలుగులో అతగాడిని మించిన స్టార్ కొరియోగ్రాఫర్ లేడు. అల్లు అర్జున్, రామ్ చరణ్, ఎన్టీఆర్, విజయ్, అజిత్ వంటి స్టార్ హీరోలతో పాటు బాలీవుడ్‌లో కూడా ప్రఖ్యాతి పొందాడు.
అంతేనా, కొన్ని కామెడీ షోల్లో కూడా పాల్గొన్నాడు. డ్యాన్స్‌కు ఫిదా కాని ప్రేక్షకుడు లేనప్పుడు నమ్మండి. ఇటీవల ఈ డ్యాన్స్ మాస్టర్ జానీ కేసులో ఇలాంటివారిని వదలకూడదు అని నీతులు కూడా చెప్పాడు. కానీ ఈ స్టార్ కొరియోగ్రాఫర్ గుట్టు రట్టు అయ్యాడు; ఇతగాడు కూడా ఆ కామాంధుల్లో ఒకడే అని తేలిపోయింది.
ఒక యువతిని లైంగికంగా వేధించడం, ఆమె కొరియోగ్రాఫర్ గుట్టు రట్టు చేయడానికి రెడీ అయిన నేపధ్యంలో, ఇండస్ట్రీ పెద్దలు కలుసుకుని ఈ కేసును నివారించినట్లు సమాచారం. బాగా పలుకుబడి ఉన్న ప్రముఖులను ఈ స్టార్ కొరియోగ్రాఫర్ కలుసుకుని, ఈ సమస్య నుంచి బయట పడాలని అభ్యర్థించాడు. జానీ మాస్టర్ కేసు వల్ల టాలీవుడ్ పరువు పోయిందని, మళ్లీ ఇతగాడి విషయం బయటకు వస్తే మళ్లీ బ్యాడ్ నేమ్ వస్తుందని, పలువురు ప్రముఖులు, ఛాంబర్ పెద్దలు, బాధిత యువతిని తెలుగు ఫిల్మ్ ఛాంబర్‌కు పిలిపించి సామరస్యంగా పరిష్కరించినట్లు సమాచారం.
యువతిని కేసు పెట్టవద్దని బతిమలాడి, స్టార్ కొరియోగ్రాఫర్ తన పరువును కాపాడుకున్నాడు. ఇప్పటివరకు ఏదైనా ఉంటే మేము చూసుకుంటాం, మాకు చెప్పండి అని ఛాంబర్ చెప్పడం జరిగింది. స్టార్స్ తప్పు చేస్తే, సమర్థించడం, గుట్టు చప్పుడు కాకుండా పంచాయితీ పెట్టడం దారుణమనే మాటలు వినిపిస్తున్నాయి. ఇలాంటివి జరిగాక, పెద్ద స్టార్స్ లైంగిక వేధింపులకు గురిచేస్తే, ఏ అమ్మాయి చెప్పడానికి ధైర్యంగా ముందుకు వస్తుంది అనే ప్రశ్న తలెత్తుతుంది. మరి ఇందులో నిజాలు ఏంటో తెలుసుకోవాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.
Sexual harassment cases in Tollywood are rising day by day. Thanks to the Hema Committee, women in the industry are now bravely coming forward and speaking out. It all started with the Johnny Master case, and since then, more women working in the industry have gained the courage to file cases against their harassers. The controversy, which began with actor Raj Tarun, escalated with Johnny Master’s case, and now, even YouTuber Harsha Sai is caught in the storm.
Adding to this growing list is yet another star choreographer. This renowned choreographer is also accused of harassing a young woman, who, unable to bear the harassment, considered approaching the police. But here comes the twist: this star choreographer has gained more fame than Johnny Master. In the Telugu industry, there is no bigger choreographer than him. He has worked with star heroes like Allu Arjun, Ram Charan, NTR, Vijay, Ajith, and even in Bollywood, earning wide recognition.
Not only that, but he has also appeared on several comedy shows. His dance moves have mesmerized audiences, and it’s hard to find a viewer who isn’t a fan of his work. Ironically, this same choreographer, who recently preached that people like Johnny should not be spared, has now been exposed himself. It turns out he is also one of those accused of such despicable acts.
After allegedly sexually harassing a young woman, she was ready to expose him. However, industry insiders stepped in to prevent the matter from becoming a police case. Reports suggest that the star choreographer, using his connections with influential people, pleaded with them to help him escape this predicament. Already, the Johnny Master case has tarnished Tollywood’s reputation, and another scandal involving this choreographer would only make things worse. It is said that prominent figures from the film industry, including members of the Telugu Film Chamber, intervened and amicably resolved the issue by convincing the victim not to file a case.
It is being reported that the choreographer’s reputation was saved after pleading with the victim not to press charges. While the Chamber had previously encouraged victims to come forward and assured them of support, this incident of protecting stars and covering up their wrongdoings through closed-door settlements has drawn criticism. Such incidents raise the question: if even bigger stars are involved in sexual harassment, will any woman have the courage to come forward and report it? To know the truth behind these allegations, we’ll have to wait a little longer.