కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ పోర్షే జీటీ2ఆర్ఎస్ కారును కొనుగోలు చేశారు. దీని విలువ సుమారు రూ.4 కోట్లకు పైమాటే. ఆయన భార్య షాలిని ఆ ఫొటోలను షేర్ చేశారు. అజిత్‌కు రేసింగ్, కార్లు, బైకులు అంటే ఇష్టం. ఈ ఏడాది ఆగస్టులోనూ ఆయన రూ.9 కోట్ల విలువైన ఫెరారీ కొన్నట్లు సమాచారం. దుబాయ్‌లో ఆయన ఆ కారు నడుపుతున్న వీడియో అప్పట్లో వైరల్ అయింది.
ఈ కారు కేవలం 3.2 సెకన్లలో సున్నా నుంచి 100 కి.మీ వేగాన్ని అందుకోగలదు.
ఈ కారు గరిష్ట వేగం గంటకు 296 కి.మీ. ఈ కారు ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన శాలిని, తన కారు, స్టైల్‌తో పాటు తన హృదయాన్ని కూడా గెలుచుకున్నాడని క్యాప్షన్ ఇచ్చారు.