బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ ఎన్నో సూపర్ హిట్స్ తన ఖాతాలో వేసుకుని ఇండస్ట్రీలో కొనసాగుతోంది. ఆమె ప్రజెంట్ నటిస్తున్న తాజా చిత్రం ‘జిగ్రా’. దీనికి ‘మౌనిక ఓ మై డార్లింగ్’ ఫేం వసన్ బాల దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే ఈ మూవీని అలియా భట్, అపూర్వ మెహతా, షాహీన్ భట్, సోమెన్ మిశ్రా, కరణ్ జోహార్ కలిసి ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. జిగ్రా చిత్రం అక్టోబర్ 11న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఇప్పటికే ఇందులోంచి వచ్చిన పోస్టర్స్, టీజర్ మంచి రెప్సాన్స్‌ను దక్కించుకున్నాయి. తాజాగా, జిగ్రా ట్రైలర్ మేకర్స్ విడుదల చేశారు. బ్రదర్, సిస్టర్ సెంటిమెంట్‌తో ఉన్న ఈ ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేస్తుంది. ఇందులో అలియా మాస్ యాక్షన్స్‌తో అదరగొట్టింది. అయితే తమ్ముడి కష్టాన్ని పోగొట్టడానికి అక్క చేసే పోరాటం ఏంటో ఇందులో చూపించారు. అసలు తమ్ముడికి వచ్చిన కష్టం నుంచి అక్క ఎలా కాపాడింది అనేది దీని స్టోరీ అని తెలుస్తోంది.