పుష్ప 2: ది రూల్ 2024లో అత్యంత ఆతృతగా ఎదురుచూస్తున్న భారతీయ చిత్రాలలో ఒకటి. అల్లు అర్జున్ నటించిన ఈ చిత్రం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ సినిమా డిసెంబర్ 6న విడుదల కానుంది. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ భారీ అంచనాలున్న చిత్రం ఐటెం సాంగ్ విషయంపై కూడా ఆసక్తి ఉంది. అల్లు అర్జున్‌తో కలిసి ఈ పాటలో నటించబోయే నటి కోసం జనాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. జాన్వీ కపూర్, త్రిప్తి దిమ్రీ పేర్లు పరిశీలనలో ఉన్నాయని సమాచారం. తాజా వార్తల ప్రకారం, మేకర్స్ త్రిప్తి దిమ్రీని ఈ సాంగ్ కోసం దాదాపుగా ఫైనలైజ్ చేసినట్లు తెలుస్తోంది. చర్చలు చివరి దశలో ఉన్నప్పటికీ, ఇంకా అధికారిక ధృవీకరణ లేదు.
ఈ చిత్రంలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న కథానాయికగా నటిస్తుండగా, ఫహద్ ఫాసిల్, సునీల్, అనసూయ, ధనంజయ, రావు రమేష్, జగదీష్ ప్రతాప్ బండారి కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ భారీ ఎంటర్‌టైనర్‌ను నిర్మిస్తోంది. దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.