అల్లు Vs మెగా వివాదంలోకి పూనమ్ కౌర్

కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో అల్లు అర్జున్ Vs మెగా ఫ్యామిలీ వివాదం పెరిగిపోతుంది. తాజాగా అల్లు అర్జున్ ఇచ్చిన ఓ స్పీచ్‌ కారణంగా మెగా ఫ్యాన్స్ అల్లు ఫ్యామిలీపై తీవ్రంగా ట్రోలింగ్ చేస్తున్నారు, అదే విధంగా అల్లు అభిమానులు కూడా స్పందిస్తున్నారు. ఈ నేపథ్యంలో హీరోయిన్ పూనమ్ కౌర్ కూడా ఈ వివాదంలోకి ఎంటర్ అయింది.

సోషల్ మీడియా తెరిచిన వెంటనే అల్లు అర్జున్ ఫ్యాన్స్ మెగా ఫ్యామిలీపై, మెగా ఫ్యాన్స్ అల్లు ఫ్యామిలీపై ట్రోల్స్ చేస్తుండటం కనిపిస్తోంది. మొదట్లో ట్రోలింగ్ వరకు మాత్రమే ఉన్న ఈ వివాదం ఇప్పుడు మరింత దారుణంగా మారి బూతుల పాటల వరకు వెళ్లిపోయింది. మెగా హీరోలపై బూతులతో పాటలు కంపోజ్ చేసి అల్లు అభిమానులు విడుదల చేస్తున్నారు, ఇదే తరహాలో మెగా అభిమానులు కూడా అల్లు అర్జున్‌పై పేరడీ సాంగ్స్ చేస్తున్నారు.

ఈ వివాదం కొనసాగుతుండగా, పూనమ్ కౌర్ తాజాగా ఓ ట్వీట్ చేసింది. అల్లు అర్జున్, స్నేహా రెడ్డిలతో కలిసి ప్రార్థన చేస్తున్న ఫొటోను పోస్ట్ చేసి, “ప్రేమ, ప్రార్థన, సామరస్యం” అంటూ క్యాప్షన్ ఇచ్చింది. అలాగే “లవ్ ఈజ్ ది ఆన్సర్” అనే హ్యాష్ ట్యాగ్‌ను జోడించింది. ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అయింది.

పూనమ్ కౌర్ తన ట్వీట్ ద్వారా బన్నీకి సపోర్ట్ చేస్తూ, అతన్ని ట్రోల్ చేయడం కరెక్ట్ కాదని ఇండైరెక్ట్‌గా మెగా ఫ్యాన్స్‌కి కౌంటర్ ఇచ్చింది. ఈ ట్వీట్‌ను బన్నీ ఫ్యాన్స్ రీట్వీట్ చేస్తూ, మెగా ఫ్యాన్స్‌పై కామెంట్లు చేస్తున్నారు.

ఇలాంటి నెగెటివిటీ మధ్య అల్లు అర్జున్ తన “పుష్ప 2” చిత్రంతో మరో 100 రోజుల్లో ప్రేక్షకులను పలకరించబోతున్నారు. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి, కానీ మెగా ఫ్యాన్స్ మాత్రం ఈ సినిమాను ట్రోల్ చేస్తున్నారు. మరోవైపు, అదే నెలలో రామ్ చరణ్ “గేమ్ ఛేంజర్” కూడా విడుదల కానుంది. ఇంత నెగెటివిటీ మధ్య “పుష్ప 2” ఏ మేరకు సక్సెస్ సాధిస్తుందో చూడాలి.

See also  గేమ్ ఛేంజర్ vs పుష్ప 2: క్రిస్మస్ పోటీలో ఎవరు గెలుస్తారు?

Related Posts

మా నాన్న సూప‌ర్ హీరో రివ్యూ: సుధీర్ బాబు ఎమోషనల్ ఎంటర్‌టైనర్

Share this… Facebook Twitter Whatsapp Linkedin చిత్రం: మా నాన్న సూప‌ర్ హీరో; న‌టీన‌టులు: సుధీర్ బాబు,…

Read more

బాలయ్య అన్‌స్టాపబుల్ సీజన్ 4 .. రేపే అనౌన్స్ ప్రోమో కూడా..?

Share this… Facebook Twitter Whatsapp Linkedin మన తెలుగు ఓటీటీ ఆహాలో బాలకృష్ణ…

Read more

You Missed

శ్రీనువైట్ల – గోపిచంద్ కాంబినేషన్‌లో ‘విశ్వం’ఎలా ఉంది?

  • October 10, 2024
శ్రీనువైట్ల – గోపిచంద్ కాంబినేషన్‌లో ‘విశ్వం’ఎలా ఉంది?

మా నాన్న సూప‌ర్ హీరో రివ్యూ: సుధీర్ బాబు ఎమోషనల్ ఎంటర్‌టైనర్

  • October 10, 2024
మా నాన్న సూప‌ర్ హీరో రివ్యూ: సుధీర్ బాబు ఎమోషనల్ ఎంటర్‌టైనర్

Netizens’ Reviews on Gopichand’s Viswam: A Mixed Bag of Entertainment

  • October 10, 2024
Netizens’ Reviews on Gopichand’s Viswam: A Mixed Bag of Entertainment

Mathu Vadalara 2 on Netflix: Release Date and Streaming Details

  • October 10, 2024
Mathu Vadalara 2 on Netflix: Release Date and Streaming Details

Maa Nanna Super hero: A Heartfelt Yet Flawed Emotional Drama

  • October 10, 2024
Maa Nanna Super hero: A Heartfelt Yet Flawed Emotional Drama

Rajinikanth’s Vettaiyan Day 1 Box Office Collections: A Blockbuster in the Making

  • October 10, 2024
Rajinikanth’s Vettaiyan Day 1 Box Office Collections: A Blockbuster in the Making