ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయి చిత్రం పుష్ప-2లో బిజీగా ఉన్నారు. డిసెంబర్ 6న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుండగా, అభిమానులు మరోసారి బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయడం ఖాయమని ఆశిస్తున్నారు.
ఇదిలా ఉంటే, బన్నీ తన తదుపరి చిత్రాన్ని ఎవరి దర్శకత్వంలో చేయనున్నాడనే చర్చ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. తమిళ సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అట్లీ అల్లు అర్జున్‌తో సినిమా చేయనున్నాడనే వార్తలు చాలా కాలం నుంచి వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ కాంబినేషన్ మరోసారి నెట్టింట చర్చకు దారి తీస్తోంది. అట్లీ, అల్లు అర్జున్ కాంబినేషన్ మూవీకి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని, ఈ ప్రాజెక్ట్ కొద్ది రోజుల్లో ఫైనల్ కానుందని సమాచారం.
ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కి సంగీతం అందించేది మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ కావడం విశేషం. ఈ నేపథ్యంలో అభిమానులు ఈ ప్రాజెక్ట్‌కి AAA అనే హాష్‌ట్యాగ్ కూడా రూపొందించారు. అట్లీ తన లేటెస్ట్ మూవీ జవాన్తో భారీ విజయాన్ని అందుకున్న నేపధ్యంలో, ఇప్పుడు బన్నీతో కలిసి చేయనున్న ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయడం ఖాయమని ఫ్యాన్స్ నమ్మకంగా ఉన్నారు. మరి ఈ ప్రాజెక్ట్ నిజంగా ఫైనల్ అవుతుందా లేదా అనేది వేచి చూడాలి.
Tags: