బుల్లితెరపై యాంకర్‌గా తనకంటూ ఒక గుర్తింపు సాధించుకున్న అనసూయ.. మెల్లగా వెండితెరపైకి డైవర్ట్ అయ్యింది. దీంతో బుల్లితెరకు పూర్తిగా దూరమయ్యింది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘రంగస్థలం’లో రంగమత్త క్యారెక్టర్‌లో కనిపించి తన టాలెంట్‌ను నిరూపించుకుంది. రంగమత్త పాత్రలో ఒదిగిపోయినందుకు అనసూయకు యాక్టర్‌గా మరెన్నో అవకాశాలు వస్తాయని ఫ్యాన్స్ అనుకున్నారు. కానీ అలా జరగలేదు. మళ్లీ సుకుమారే పిలిచి ‘పుష్ప’లో తనకు నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ ఇచ్చాడు. ఈ సినిమా దాక్షాయణిగా నటించి మరోసారి తన నటనతో ఫిదా చేసిన అనసూయ.. ‘పుష్ప 2’ గురించి తాజాగా కీలక వ్యాఖ్యలు చేసింది.
బిగ్ బాస్ సీజన్ 8లో తాజాగా దీపావళి స్పెషల్ ఎపిసోడ్ జరిగింది. ఆ ఎపిసోడ్‌కు అనసూయ గెస్ట్‌గా వచ్చింది. బిగ్ బాస్ స్టేజ్‌పై డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఇవ్వడంతో పాటు కంటెస్టెంట్స్‌తో కూడా ముచ్చటించింది. అదే సమయంలో ‘పుష్ప 2’ (Pushpa 2) గురించి ఒక ఆసక్తికర విషయం బయటపెట్టింది. మొదటి భాగంలో చూపించిన కథనే మరింత లోతుగా ఈ సీక్వెల్‌లో చూడబోతున్నారని చెప్పుకొచ్చింది. అంతే కాకుండా ‘పుష్ప 2’లో ప్రతీ 10 నిమిషాలకు ఒకసారి ఒక హై మూమెంట్ ఉంటుందని స్టేట్‌మెంట్ ఇచ్చింది. దీంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ సంతోషానికి హద్దులు లేవు. ఇప్పటికే ఈ మూవీ ఒక రేంజ్‌లో ఉంటుందని ఫిక్స్ అయిపోతున్నారు.