యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజా సినిమా ‘దేవర’. కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఈ మోస్ట్ వెయిటెడ్ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. సైఫ్ అలీఖాన్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. హై బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాపై ఫ్యాన్స్‌తో పాటు.. ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అందులోనూ ‘దేవర’ నుంచి ఇప్పటివరకు వచ్చిన ప్రతి అప్‌డేట్ ఎంతో ఆకట్టుకోగా.. సాంగ్స్‌కు సోషల్ మీడియాలో స్పెషల్ క్రేజ్ వచ్చింది. అంతే కాకుండా.. ‘చుట్టమల్లె.. చుట్టేస్తాంది’ సాంగ్ అత్యదిక వ్యూస్ సాధించి ప్రజెంట్ ట్రెండింగ్‌లో నిలిచింది. అలాగే ఈ సినిమాలో నుంచి ఇంకా కొన్ని సాంగ్ రిలీజ్ కావాల్సి ఉండగా.. మూవీ రిలీజ్‌కు ఇంకా కొన్ని గంటలు మాత్రమే ఉండటంతో సాంగ్స్ రిలీజ్ చేయలేదు మేకర్స్.
అయితే.. ఇటీవల ‘దేవర’ నుంచి ‘ఆయుధ పూజ’ సాంగ్ విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. కానీ రిలీజ్ చేయలేదు. అయితే.. ఎట్టకేలకు ఈ సాంగ్ విడుదల చేశారు మేకర్స్. ప్రజెంట్ ‘ఆయుధ పూజ’ సాంగ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా.. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్న ఈ సినిమా.. విడుదలకు ముందే పలు రికార్డులను సృష్టించింది. ఓవర్సీస్‌లో ప్రీసేల్ బుకింగ్స్‌లో అత్యంత వేగంగా వన్ మిలియన్ డాలర్ల మార్క్‌ను చేరుకున్నట్లు తెలుస్తోంది. ఇక ‘దేవర’ రిజల్ట్ తెలుసుకునేందుకు కొన్ని గంటలు మాత్రమే ఉండటంతో.. ప్రేక్షకులు ఎంతో ఈగర్‌గా ఎదురుచూస్తున్నారు.