అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి..బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో ఫుల్ స్వింగ్ లో ఉన్నారు నందమూరి నటసింహం బాలకృష్ణ. ప్రస్తుతం బాబీ డైరెక్షన్ లో ఆయన ఓ సినిమా చేస్తున్నారు. షూటింగ్ జెట్ స్పీడ్ లో జరుగుతోంది. అయితే, టాలీవుడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి డైరెక్షన్ లో బాలకృష్ణ ఓ యాడ్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. బాలయ్య, సంయుక్తా మీనన్ తో వెంకీ ఈ యాడ్ ను డైరెక్ట్ చేశాడు. ఈ యాడ్ కు సంబంధించి బాలకృష్ణ. లుక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తెల్లని షర్ట్, పంచెకట్టు, మెడలో కండువాతో తెలుగు సంప్రదాయం ఉట్టిపడేలా బాలకృష్ణ కనిపిస్తున్నారు. దీంతో ఆయన ఫ్యాన్స్ సంబురపడిపోతున్నారు. బాలయ్య లుక్ సూపర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు
మా నాన్న సూపర్ హీరో రివ్యూ: సుధీర్ బాబు ఎమోషనల్ ఎంటర్‌టైనర్
Share this… Facebook Twitter Whatsapp Linkedin చిత్రం: మా నాన్న సూపర్ హీరో; నటీనటులు: సుధీర్ బాబు,…
Read more