టాలీవుడ్ యంగ్ హీరో తరుణ్ సినిమాల లైనప్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకవైపు లైంగిక వేధింపుల కేసు తన పై ఉన్నా కూడా వరుస సినిమాలు చేస్తున్నాడు. ఒక నెల గ్యాప్ లోనే మూడు సినిమాల తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అందులో ఒక పురుషోత్తముడు సినిమా మాత్రమే ఓ మాదిరిగా ఆకట్టుకుంది.. మిగిలిన రెండు సినిమాలు బోల్తా కొట్టాయి. అయితే భలే ఉన్నాడే సినిమాతో రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమా వచ్చి రెండు వారాలు పూర్తి అయ్యింది. అప్పుడే ఓటీటీలోకి వచ్చేస్తుంది.. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం..
రాజ్ తరుణ్ నటించిన తిరగబడరా సామి, పురుషోత్తముడు సినిమాలు యావరేజ్ టాక్ ను అందుకున్నాయి. రాజ్ తరుణ్ నటించిన భలే ఉన్నాడే మూవీ స్ట్రీమింగ్ హక్కులను ఈటీవీ విన్ సొంతం చేసుకుంది. సెప్టెంబర్ 13న థియేటర్లలో రిలీజైన ఈ సినిమాను అక్టోబర్ 3 నుంచి తమ ప్లాట్‌ఫామ్ పై స్ట్రీమింగ్ చేయనున్నట్లు సదరు ఓటీటీ వెల్లడించింది..