బిగ్‌బాస్ తెలుగు 8వ సీజన్ (Bigg Boss Telugu 8) ప్రారంభమైంది. గ్రాండ్ లాంచ్ ఈవెంట్ ఆదివారం సెప్టెంబర్ 1 రాత్రి 7 గంటలకు ఘనంగా ప్రారంభమైంది. ఈ ఈవెంట్ లో హోస్ట్ నాగార్జున ఎంట్రీ అదిరిపోయింది. దేవర ఫియర్ సాంగ్‌కు డ్యాన్స్ తో ఎంట్రీ ఇచ్చి, లిమిట్లెస్ అంటూ షోను ప్రారంభించారు. ఈ సీజన్ కోసం బిగ్‌బాస్ హౌస్ మొత్తం అడవి థీమ్‌లో ఉండగా, జంవుతుల బొమ్మల థీమ్‌తో రూములు మరియు కొన్ని వస్తువులు అలంకరించారు. బిగ్‌బాస్ హౌస్‌లోకి 14 మంది కంటెస్టెంట్లు ప్రవేశించారు. వీరు ఏడు జోడీలుగా ఉన్నారు.
ప్రైజ్‌మనీ జీరో
ఈ సీజన్లో బిగ్‌బాస్ కంటెస్టెంట్లకు పెద్ద షాక్ ఇచ్చారు. ప్రైజ్‌మనీ జీరో అని ప్రకటించారు. అయితే, ఆట ఆడే కొద్దీ ప్రైజ్‌మనీ పెరుగుతుందని చెప్పారు. లిమిట్లెస్గా డబ్బు గెలుచుకునే అవకాశం ఉందని తెలిపారు. కంటెస్టెంట్లు టాస్కులు చేసే కొద్దీ ప్రైజ్‌మనీ జీరో నుంచి పెరుగుతుందని అన్నారు. అలాగే, ఈ సీజన్ మొత్తం కెప్టెన్ లేకుండా కొనసాగుతుందని చెప్పారు, ఇది మరొక పెద్ద షాకే.
బిగ్‌బాస్ ప్రోమో
లేటెస్ట్గా రిలీజ్ చేసిన ప్రోమోలో నిఖిల్, నాగ మణికంఠల మధ్య గొడవ జరిగినట్లు చూపించారు. నాగ మణికంఠ మాట్లాడుతూ “నీ వల్ల ఇష్యూ పెద్దది అవుతుంది” అని చెబుతుండగా, “నా వల్ల అయితే వదిలేయ్” అంటూ నిఖిల్ చెప్పడం చూపించారు. ఈ ప్రోమో చూస్తుంటే ఇద్దరి మధ్య పెద్ద గొడవ జరిగినట్టు స్పష్టమవుతోంది.
శేఖర్ బాషా vs సోనియా ఆకుల
అలాగే శేఖర్ బాషా, సోనియా ఆకుల మధ్య గొడవ కూడా గట్టిగానే జరిగినట్లు ప్రోమో చూస్తే తెలుస్తోంది. కిచెన్‌లోని ఆరెంజ్ పండ్లను తీసుకొని క్యాచ్‌లు పట్టుకుంటూ శేఖర్ ఆటాడుతుండటంపై సోనీ సీరియస్ అయ్యింది. “ఎవరైతే ఆడుతున్నారో వాళ్లెవ్వరూ ఆరెంజెస్ ముట్టడానికి వీల్లేదు” అంటూ వార్నింగ్ ఇచ్చింది. దీనికి శేఖర్ బాషా కూడా సీరియస్ గానే స్పందిస్తూ, “హౌజ్‌లో ఉన్నవన్నీ అందరి ప్రాపర్టీ.. నీ ఒక్కదానివే కాదు” అంటూ వాదనకు దిగాడు. “ఎవరైతే మనుషుల్లాగా తిందామని అనుకుంటున్నారో వాళ్లదాంట్లో అవి పెట్టకండి” అని సోనీ మరోసారి సీరియస్‌గా చెబుతుండగా, “అప్పుడు ఆ పండు తింటూ అంటే నేను మనిషిని కాదా” అని శేఖర్ బాషా అంటాడు.
సీజన్ 8 పై అంచనాలు
తొలిరోజు నుంచే బిగ్‌బాస్ తన అసలైన గేమ్‌ను ప్రారంభించినట్టు నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు. ఎప్పటి మాదిరిగానే ఈ సీజన్ 8లో టీవీ సీరియల్స్‌కి అధిక ప్రాధాన్యత ఇచ్చినట్టు కంటెస్టెంట్లను చూస్తే అర్థం అవుతోంది. ఏదేమైనా తాజా ప్రోమోతో షోపై అంచనాలు రెట్టింపు అయ్యాయి.