టాలీవుడ్.. ఎవరెవరు ఎంతెంత ఇచ్చారంటే..?
ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల కారణంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ వరదలు సంభవించాయి. ప్రజలు తినడానికి తిండి, తాగడానికి మంచినీళ్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు సహాయక చర్యలను ముమ్మరం చేశాయి. ఈ కష్ట సమయంలో తెలుగు సినీ పరిశ్రమ ప్రముఖులు ముందుకు వచ్చి సహాయంగా భారీ విరాళాలు ప్రకటించారు.
జూనియర్ ఎన్టీయార్, పవన్ కళ్యాణ్, అశ్వనీదత్, మహేశ్ బాబు, విశ్వక్ సేన్ తదితరులు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల రిలీఫ్ ఫండ్‌కి ఆర్థిక సాయంగా విరాళాలు అందజేశారు.
తాజాగా, టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి వరద బాధితుల సహాయార్థం భారీ విరాళం ప్రకటించారు. ఆయన తన వ్యక్తిగత ‘X’ ఖాతాలో పోస్ట్ చేస్తూ:
“తెలుగు రాష్ట్రాల్లో జరిగిన ఈ భారీ వరదలు ప్రజలకు చాలా నష్టం కలిగించాయి. ప్రజల కష్టాలు, అమాయక ప్రాణ నష్టం నన్ను కలిచివేశాయి. రెండు ప్రభుత్వాలు ముఖ్యమంత్రుల నాయకత్వంలో శాయశక్తులా సహాయ చర్యలను చేపడుతున్నాయి. మనందరం సహాయ కార్యక్రమాల్లో పాలుపంచుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే నేను నా వంతుగా రూ. 1 కోటి (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్‌లకు చెరో రూ. 50 లక్షలు) విరాళంగా ప్రకటిస్తున్నాను. ఈ విపత్కర పరిస్థితులు త్వరగా తీరిపోవాలని, ప్రజలంతా సురక్షితంగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను.”
చిరంజీవి చేసిన ఈ గొప్ప ప్రకటన పట్ల అభిమానులు, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఇలా ముందుకు రావడంతో మరికొందరు కూడా సహాయ కార్యక్రమాల్లో భాగస్వాములవుతారని ఆశించవచ్చు. ప్రభుత్వాలు, ప్రజలు కలిసి ఈ కష్టాలను త్వరగా అధిగమిస్తారని ఆశిద్దాం.
టాలీవుడ్.. ఎవరెవరు ఎంతెంత ఇచ్చారంటే..?
1 – జూనియర్ ఎన్టీయార్ అటు ఆంధ్రప్రదేశ్ సీఎం రిలీఫ్ ఫండ్ కు రూ. 50 లక్షలు, ఇటు తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్ కు రూ. 50 లక్షలు విరాళం అందించారు 2 – హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ AP సీఎం రిలీఫ్ ఫండ్ కు రూ. 50 లక్షలు, TG సీఎం రిలీఫ్ ఫండ్ కు రూ. 50 లక్షలు విరాళం ఇచ్చారు 3 – ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెండు తెలుగు రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్ కు చెరో రూ. 50 లక్షలు ఆర్థిక సాయం ప్రకటించారు 4 – టాలీవుడ్ సూపర్ స్టార్ ఘట్టమనేని మహేశ్ బాబు ఆంధ్ర సీఎం రిలీఫ్ ఫండ్ కు రూ.50 లక్షలు, టీజీ సీఎం రిలీఫ్ ఫండ్ కు రూ. 50 లక్షలు విరాళం ప్రకటించారు 5 – మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్ కు రూ. 5 లక్షలు, టీజీ సీఎం రిలీఫ్ ఫండ్ కు రూ. 5 లక్షలు విరాళాలు ఇచ్చారు 6 – స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ రూ.15 లక్షల చొప్పున ఇరు రాష్ట్రాల సీఎం సహాయనిధికి రూ. 30 లక్షల విరాళం 7 – దర్శకుడు త్రివిక్రమ్, హారిక హాసిని నిర్మాతలు రాధాకృష్ణ, నాగవంశీ రూ.25 లక్షల చొప్పున రూ.50 లక్షలు ప్రకటించారు 8 – రెండు తెలుగు రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్ కు దర్శకుడు వెంకీ అట్లూరి రూ. 5 లక్షల చొప్పున రూ.10 లక్షల విరాళం ఇచ్చారు. 9 – ఏపీ ముఖ్యమంత్రి సహాయనిధికి వైజయంతీ మూవీస్ అధినేత కల్కి చిత్ర నిర్మాత అశ్వినీదత్ రూ.25 లక్షలు ప్రకటించారు 10 – యంగ్ హీరోయిన్ అనన్య నాగళ్ళ రూ. 2.5 లక్షల చొప్పున రూ. 5 లక్షలు సీఎం సహాయనిధికి ఇచ్చారు