స్టార్ హీరోస్ అందరూ ఒకేచోట కలవడం అనేది చాలా అరుదు అని చెప్పాలి. ఒకప్పుడు ఇలా కలవడం కామనే కానీ, ఇప్పుడు చాలా రేర్ అని చెప్పుకోవచ్చు. స్టార్ డమ్ పెరగడం, ఫ్యాన్స్ పెరగడం.. సోషల్ మీడియాలో ట్రోల్స్ వలన.. ఇప్పుడు స్టార్ అందరూ ఒకేచోట కలువలేకపోతున్నారు. ఎప్పుడైనా ఒక స్టార్ హీరో.. ఇంకో స్టార్ హీరోను కలిస్తే ఆరోజు ఆ ఇద్దరు హీరోల ఫ్యాన్స్ కు పండగే.
ఇక ఇప్పుడు ఈ ఫోటో చూస్తే ఇండస్ట్రీ మొత్తం పండగ చేసుకోవడం ఖాయమని చెప్పాలి. అంతలా ఆ ఫొటోలో ఏముంది అంటే.. టాలీవుడ్ సీనియర్ హీరోలు.. వారి వారసులు మొత్తం కలిసి మాల్దీవ్స్ లో పార్టీ చేసుకున్నారు. అందుకు సంబంధించిన ఫోటోనే ఇది. టాలీవుడ్ ను ఏలుతున్న ఫ్యామిలీస్ లో మెగా, అక్కినేని, ఘట్టమనేని కుటుంబాలు ఉన్నాయి. ఈ మూడు కుటుంబాలు ఒకే ఫ్రేమ్ లో కనిపించాయి.
మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జున, ఘట్టమనేని మహేష్ బాబు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, అయ్యగారు అక్కినేని అఖిల్ .. ఇలా వీరందరూ కలిసి మాల్దీవ్స్ లో పార్టీ చేసుకున్నట్లు తెలుస్తోంది. లంచ్ టైమ్ లో వీరందరూ ఇదుగో ఇలా ఫుడ్ తింటూ కనిపించారు. నాగార్జున, చిరు పక్కన మహేష్ కూర్చోగా.. రామ్ చరణ్, అఖిల్ అన్నదమ్ముల్లా ఒకపక్క కూర్చున్నారు.
ఇక మహేష్ భార్య నమ్రత , చరణ్ భార్య ఉపాసన కూడా ఇందులో కనిపించారు. ఇలా నలుగురు స్టార్ హీరోలను ఒకే ఫ్రేమ్ లో చూసేసరికి ఫ్యాన్స్ ఎగిరి గంతేస్తున్నారు. అసలు ఇదంతా ఎప్పుడు జరిగింది అని ఫ్యాన్స్ అయోమయంలో పడ్డారు. ఈ మధ్యనే వీరందరూ కలిసారని తెలుస్తోంది. ఈ ఫోటో మొత్తంలో మహేష్ లుక్ ఇంకా వైరల్ గా మారింది. ఈరోజు ఇంటర్నెట్ ను షేక్ చేసే ఫోటో ఇదే అంటూ అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు.