రామ్ చరణ్ వ్యక్తిగత జీవితంలో పక్కా ఫ్యామిలీ మ్యాన్ అన్న విషయం అందరికీ తెలిసిందే. తండ్రి చిరంజీవి, తల్లి సురేఖ, భార్య ఉపాసన, కూతురు క్లీన్కారనే ఆయన ప్రపంచం. ఉపాసన కూడా మెగా ఫ్యామిలీలో కోడలుగా అడుగుపెట్టినప్పటి నుంచి చరణ్‌తో పాటు కుటుంబంపై ఎంతో ప్రేమ చూపిస్తున్నారు. అయితే ఒక సందర్భంలో రామ్ చరణ్ గురించి చిరంజీవి చేసిన ఒక కామెంట్ విని ఉపాసన షాక్ అయిపోయిందట.
అది ఎప్పుడు అంటే – ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల తర్వాత రామ్ చరణ్ గోల్డెన్ గ్లోబ్స్ 2023 అవార్డుల వేడుకకు హాజరయ్యారు. తన తోటి నటుడు జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు రాజమౌళి కూడా ఈ వేడుకకు వెళ్లారు. ఆ సమయంలో చరణ్ ఆర్ఆర్ఆర్ విజయంపై మాట్లాడారు. అలాగే, తన తండ్రి చిరంజీవి లుక్ విషయంలో ఎంత పర్ఫెక్ట్‌గా ఉంటారో కూడా షేర్ చేసుకున్నారు.
రామ్ చరణ్ చెప్పిన ప్రకారం: “మా నాన్న 41 సంవత్సరాలుగా నటుడిగా రాణిస్తున్నారు. ఆయనకు లుక్, షేప్ విషయంలో కచ్చితంగా ఓ అభిప్రాయం ఉంటుంది. ఒకసారి నా భార్య ఉపాసన దానిని విని ఆశ్చర్యపోయింది. ఒక రోజు డైనింగ్ టేబుల్ దగ్గర భోజనం చేస్తున్నప్పుడు నాన్న ‘నువ్వు కాస్త బరువు తగ్గినట్లున్నావ్’ అన్నారు. దానికి నేను ‘అవును డాడ్’ అన్నా. వెంటనే ఆయన ‘ఒరేయ్ ఇడియట్! నేను బరువు తగ్గావని కాదు, పెరిగిందని అంటున్నా. జిమ్‌కు వెళ్లడం మానేశావా?’ అని నన్ను మందలించారు. నా భార్య వెంటనే ‘ఇది ఫిజికల్‌గా కించపరిచినట్టే కదా?’ అని అడిగింది. నేను ఆమెకు ‘యాక్టర్లలో ఇది సాధారణమే’ అని చెప్పాను” అని చరణ్ చెప్పాడు.
ఇంకా, తన విద్యా కాలం గురించి మాట్లాడుతూ – “నాకు నటనలో రాకముందు చదువు పూర్తి చేయాలని మా నాన్న అనేవారు. కానీ చివరికి ఆయనే రియలైజ్ అయ్యారు, నేను చదువులో అంత గొప్పగా ఉండేవాడిని కాదు. మా కాలేజీ డీన్ కూడా నాన్నకు ‘మీ అబ్బాయి సమయాన్ని వృథా చేయకండి, అతనికి ఆసక్తి ఉన్న ఫీల్డ్‌లో చేర్చండి’ అని చెప్పారు. అప్పుడే నాన్న యాక్టింగ్ స్కూల్‌లో జాయిన్ చేయించారు. అలా నా సినీ ప్రయాణం మొదలైంది” అని చెర్రీ వివరించారు.
ప్రస్తుతం రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కియారా అద్వానీ ఆయనతో జతకడుతున్నారు. ఇది ఒక పొలిటికల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోంది.