సినీ నటుడు పోసాని కృష్ణమురళిపై ఏపీ సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. టీడీపీ నేత, రాష్ట్ర తెలుగు యువత ప్రతినిధి బండారు వంశీకృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐడీ కేసు నమోదు చేసింది.
గత ఏడాది సెప్టెంబర్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో పోసాని మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ అసత్య ప్రచారం చేశారని తన ఫిర్యాదులో వంశీకృష్ణ పేర్కొన్నారు.
పోసాని చేసిన వ్యాఖ్యలు చంద్రబాబును కించపరిచేలా, వ్యక్తిత్వాన్ని హననం చేసేలా ఉన్నాయని చెప్పారు. సామాజికవర్గాల మధ్య విభేదాలు తలెత్తేలా మాట్లాడిన పోసానిపై చర్యలు తీసుకోవాలని కోరారు. వంశీకృష్ణ ఫిర్యాదుతో సీఐడీ అధికారులు 111, 196, 353, 299,336 (3)(4), 341, 61(2) బీఎన్ఎస్ సెక్షన్ల కింద పోసానిపై కేసు నమోదు చేశారు.