ఇప్పటి వరకు మెగా అభిమానుల మధ్యే విభజన ఉందనుకుంటూ ఉండేవాళ్లం. ఫ్యాన్స్ మధ్య ఎన్ని గొడవలు ఉన్నా, మెగా ఫ్యామిలీలో అందరూ కలిసే ఉన్నారనే అభిప్రాయమే ఉండేది. అయితే, ఇటీవలి పరిణామాలతో కుటుంబంలో కూడా విభేదాలు పెరిగాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
వైసీపీ అభ్యర్థి శిల్పా రవికి అల్లు అర్జున్ ప్రచారం చేయడం ద్వారా మెగా ఫ్యామిలీలో విభేదాలు మొదలయ్యాయని ఆ కుటుంబానికి దగ్గరగా ఉన్న వాళ్లు అంటున్నారు. ఆ సమయంలో, పరోక్షంగా బన్నీని టార్గెట్ చేస్తూ నాగబాబు చేసిన ఒక ట్వీట్ ఎంత చర్చకు దారితీసిందో అందరికీ తెలుసు.
ఆ తర్వాత నుండి, బన్నీకి, మిగతా మెగా ఫ్యామిలీ హీరోలకు మధ్య దూరం పెరుగుతున్నట్లు సమాచారం. ఇటీవల ‘మారుతి నగర్ సుబ్రహ్మణ్యం’ ప్రి-రిలీజ్ ఈవెంట్లో బన్నీ చేసిన వ్యాఖ్యలు ఈ దూరాన్ని మరింత పెంచినట్లు అనిపిస్తోంది.
బన్నీ, మెగా ఫ్యామిలీలోని కొంతమంది యంగ్ హీరోలకు మధ్య విభేదాలు ఎంతగా పెరిగాయో అర్థం చేసుకోవడానికి తాజా ఉదాహరణ ఇదే. విశ్వసనీయ సమాచారం ప్రకారం, అల్లు అర్జున్, సాయిధరమ్ తేజ్, వరుణ్ తేజ్ ముగ్గురూ రామోజీ ఫిలిం సిటీలో దగ్గర్లోనే షూటింగ్‌లో పాల్గొన్నప్పటికీ, ఒకరినొకరు కలవలేదట.
బన్నీ సినిమా ‘పుష్ప-2’ షూట్ జరుగుతున్న సమీపంలోనే తేజు, వరుణ్ సినిమాల చిత్రీకరణ జరుగుతోంది. కానీ తేజు, వరుణ్ ఇద్దరూ ఒకరినొకరు కలుస్తున్నప్పటికీ, బన్నీ దగ్గరికి మాత్రం వెళ్లలేదు. అలాగే, బన్నీ కూడా వారిని కలవడానికి ప్రయత్నించలేదట. ఇది మెగా ఫ్యామిలీలో ఏర్పడ్డ విభేదాలకు సంకేతమని, ఒకప్పుడు చాలా అన్యోన్యంగా ఉన్న ఫ్యామిలీ హీరోలే ఇలా ఉన్నప్పుడు, అభిమానులు సోషల్ మీడియాలో గొడవపడడంలో ఆశ్చర్యం లేదని ఈ విషయం తెలిసిన వారు చర్చించుకుంటున్నారు.