ప్రస్తుతం టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర చిత్రంలో హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రానికి ప్రముఖ తెలుగు డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహిస్తుండగా స్వర్గీయ నటి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. కాగా ఈ చిత్రంలో బాలీవుడ్ ప్రముఖ హీరో సైఫ్ అలీఖాన్ విలన్ పాత్రలో నటిస్తున్నాడు. ఇటీవలే దేవర చిత్ర ట్రైలర్ విడుదల కాగా ఇటు టాలీవుడ్ లో, అటు బాలీవుడ్ లో మంచి రెస్పాన్స్ వచ్చింది.
అయితే దేవర చిత్రం విడుదల కాకముందే రికార్డులు క్రియేట్ చేస్తోంది. కాగా యూఎస్ లో దేవర చిత్ర ప్రీమియర్ ప్రీసేల్స్ టికెట్లు విడుదల చెయ్యగా విడుదలకి ఇంకా 13 రోజులు ఉండగానే ఇప్పటివరకూ దాదాపుగా 40000కి పైగా టికెట్లు అమ్ముడయ్యాయి. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ సభ్యులు అధికారికంగా ప్రకటించారు
కాగా ఇటీవలే ఓవర్సిస్ యూఎస్ లో ప్రీసేల్స్ అడ్వాన్స్ బుకింగ్ టికెట్లు విడుదల చెయ్యగా దేవర చిత్ర విడుదలకి ముందే రూ.8.3 కోట్లు కలెక్ట్ చేసింది. దీంతో భారత్ లో దేవర చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే దేవర చిత్రం యూఎస్ లో సెప్టెంబర్ 26వ తారీఖున ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా భారత్ లో సెప్టెంబర్ 27వ తారీఖున ప్రేక్షకుల ముందుకు రానుంది.
అయితే దేవర చిత్ర బడ్జెట్ మరియు ఎన్టీఆర్ క్రేజ్ దృష్ట్యా భారత్ లో దేవర చిత్ర టికెట్ల రేట్లు పెరిగే అవకాశం ఉంది. ఈ క్రమంలో తెలంగాణలో మల్టీప్లెక్స్‌లలో రూ.413, సింగిల్ స్క్రీన్‌లలో రూ.250, ఏపీలో మల్టీప్లెక్స్‌లలో రూ.325, సింగిల్ స్క్రీన్‌లలో రూ.200 గా ఉండబోతున్నట్లు సమాచారం.