గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ బ్లాక్ బాస్టర్ మూవీ దేవర.. ఈ సినిమా నిన్న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. విడుదలైన మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ ను అందుకున్న ఈ మూవీ బాక్సాఫీస్ ను షేక్ చేసే కలెక్షన్స్ ను రాబట్టిందని టాక్. అయితే విడుదలకి ముందే అడ్వాన్స్ బుకింగ్స్ విషయంలో రికార్డులు సృష్టించిన దేవర ఇప్పుడు మొదటి రోజు హైయెస్ట్ గ్రాస్ కలెక్షన్ల రికార్డుపై కన్నేసింది.. తెలుగు రాష్ట్రాలలో అర్థరాత్రి 1 గంటకు షోలను వేశారు. ఈ చిత్రానికి అడ్వాన్స్ బుకింగ్స్‌లో అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద మొదటి రోజు దాదాపు 125 కోట్ల రూపాయలు వసూల్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరి దేవర ఫస్ట్ డే ఎన్ని కోట్లు రాబాట్టిందో ఒకసారి వివరంగా చూసేద్దాం..
ఈ ఏడాది బాక్సాఫీస్ రికార్డులను బ్రేక్ చేసిన కల్కి సినిమాతో దేవర సినిమా పోటి పడింది. కల్కి ప్రపంచ వ్యాప్తంగా తొలి రోజున రూ.177.70 కోట్లను వసూలు చేసింది. ఇక ఎన్టీఆర్ నటించిన బ్లాక్ బాస్టర్ మూవీ దేవర విషయానికొస్తే.. ప్రపంచ వ్యాప్తంగా సుమారు రూ.75 కోట్ల అడ్వాన్స్ బుకింగ్‌లను నమోదు చేసిందని ఫిల్మ్ ట్రేడ్ పోర్టల్ సక్‌నిల్క్ తెలిపింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మార్కెట్‌లో ఈ చిత్రానికి రూ.65-70 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్లు అందుకునిందని టాక్ వినిపిస్తుంది. దేవర సినిమాకు మొత్తంగా చూసుకుంటే మొదటి రోజు రూ.85-90 కోట్ల మధ్య వసూళ్లు చేసే అవకాశం ఉండవచ్చునని పేర్కొంది. ప్రీమియర్ అమ్మకాలతో సహా ఓవర్సీస్ మార్కెట్‌లో ఈ చిత్రం రూ. 40 కోట్ల విలువైన టిక్కెట్లు అమ్ముడయ్యాయని తెలిపింది. మొత్తానికి ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రికార్డుల మోత మోగిస్తుంది.
గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన అవైటెడ్ పాన్ ఇండియా చిత్రమే దేవర. ఇది తారక్ కెరీర్ లో 30 వ సినిమాగా, దర్శకుడు కొరటాలతో రెండో సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. ఈ క్రమంలోనే ఫస్ట్ డే ఫస్ట్ షో కలెక్షన్స్ దేవర ఊచకోత మొదలైపోయింది. ఇక తాజాగా ఒక్క రోజుకు రూ. 140 కోట్లు రాబట్టిందని టాక్.. ఏపీ, తెలంగాణాలో కలిపి రూ. 60-70 కోట్లు, నార్త్ లో చాలా తక్కువ వసూల్ చేసినట్లు ఉంది. కేవలం రూ. 7 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసింది. ఇక ఇప్పటికే సినిమాకు బిజినెస్ రూ. 400 కోట్లకు పైగా వచ్చినట్లు సమాచారం. మొత్తానికి దేవర మూవీ కలెక్షన్స్ భారీగా వచ్చినట్లు తెలుస్తుంది. ఇక ఈ వీకెండ్ కలెక్షన్స్ భారీగా పెరిగేటట్లు ఉన్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. దేవర సినిమాతో ఎన్టీఆర్ ఖాతాలో మరో హిట్ పడింది.. ఇక నెక్స్ట్ రెండు ప్రాజెక్టులతో రాబోతున్నాడు.