ఎన్టీఆర్ బ్లాక్‌బస్టర్ సినిమా దేవర ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్సయినట్లు సోషల్‌మీడియాలో ప్రచారం జరుగుతుంది. దసరా సందర్భంగా సెప్టెంబర్ 27న విడుదలైన ఈ చిత్రం ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సుమారు రూ. 500 కోట్లకు పైగానే కలెక్షన్లు రాబట్టింది. ఈ సినిమాతో డిస్ట్రిబ్యూటర్స్ కూడా భారీగా లాభ పడ్డారని నాగవంశీ తెలిపారు.
దాదాపు రూ. 300 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన దేవర బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. ఓటీటీలో కూడా నెట్‌ఫ్లిక్స్ భారీ ధరకు డీల్ కుదుర్చుకుంది. థియేటర్లలో రిలీజైన ఆరు వారాల తర్వాత ఓటీటీలో విడుదల చేయాలనే ఓప్పందం దేవర మేకర్స్‌తో ఉన్నట్లు సమాచారం. దీంతో నవంబర్ 8న తెలుగుతో పాటు హిందీ,తమిళ్,కన్నడ,మలయాళం భాషలలో స్ట్రీమింగ్‌కు తీసుకురావాలని నిర్ణయించారట. ఈమేరకు బలంగా వార్తలు వస్తున్నాయి.
కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన దేవర చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ పతాకాలపై మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ.కె ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాలో జాన్వీ కపూర్, బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్, ప్రకాష్‌రాజ్ వంటి స్టార్స్ నటించారు