మాస్ మహారాజ రవితేజ ఒకప్పుడు మినిమం గ్యారెంటీ హీరోగా ఫేమ్ పొందినప్పటికీ, ఇటీవలి కాలంలో విజయాలు అందుకోవడం కష్టంగా మారింది. రవితేజ కొత్త డైరెక్టర్లతో, అలాగే అనుభవం ఉన్న డైరెక్టర్లతో కూడా కలిసి డిఫరెంట్ సినిమాలు చేసినప్పటికీ, బాక్సాఫీస్ వద్ద పెద్ద హిట్స్ అందుకోలేకపోయారు.
అయితే, రవితేజ నటించిన మిస్టర్ బచ్చన్ గత నెలలో విడుదలై భారీ పరాజయం పాలైంది. మిస్టర్ బచ్చన్ ఆడియో రిత్యా మంచి బజ్ సృష్టించినప్పటికీ, సినిమా విడుదలైన తర్వాత దారుణమైన సమీక్షలను ఎదుర్కొంది. రవితేజ అభిమానులు బాలీవుడ్ సూపర్ హిట్ రైడ్ రీమేక్ అయిన ఈ సినిమా ద్వారా పెద్ద విజయం సాధిస్తారని భావించినా, అది జరగలేదు.
అదే సమయంలో, రవితేజ నటించిన టైగర్ నాగేశ్వరరావు మరియు ఈగల్ సినిమాలు కూడా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. మిస్టర్ బచ్చన్ ఘోర పరాజయానికి బాధ్యత వహిస్తూ రవితేజ మరియు దర్శకుడు హరీష్ శంకర్ తమ రెమ్యునరేషన్‌లో భాగం తిరిగి ఇచ్చినట్లు సమాచారం. రవితేజ రూ. 4 కోట్లు, హరీష్ శంకర్ రూ. 2 కోట్లు తిరిగి ఇచ్చారని, ఇది నిర్మాతలకు కొంత ఉపశమనం కలిగించినట్లు ఫిల్మ్ సర్కిల్స్ టాక్.
ఇప్పటికే పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీతో ఈగల్ మరియు మిస్టర్ బచ్చన్ సినిమాలు ఘోరంగా విఫలమైనప్పటికీ, వీరి కాంబినేషన్ లో వచ్చిన మొదటి చిత్రం ధమాకా మాత్రం పెద్ద విజయం సాధించింది.