గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ – శంకర్ కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘గేమ్ ఛేంజర్’ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. 2024 క్రిస్మస్ సందర్భంగా ఈ చిత్రం విడుదల కానుందని నిర్మాత దిల్ రాజు ఇప్పటికే ప్రకటించారు. ఈ సినిమాలో సీనియర్ నటుడు ఎస్‌జే సూర్య కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇటీవల సూర్య, నాని నటించిన ‘సరిపోదా శనివారం’ చిత్రంలో ప్రతినాయకుడి పాత్రలో అదరగొట్టారు, ఆయన పాత్రకు మంచి స్పందన లభించింది.
సూర్య తన నటనతో ప్రేక్షకుల ప్రశంసలు పొందుతున్నారు. ఈ నేపథ్యంలో ‘గేమ్ ఛేంజర్’లో ఆయన పాత్ర గురించి నిర్మాత దిల్ రాజు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. సూర్య పాత్ర ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఉంటుందని, ‘సరిపోదా శనివారం’ సక్సెస్ మీట్‌లో దిల్ రాజు పేర్కొన్నారు.
“ప్రతినాయకుడు అంటే ‘ఒక్కడు’లో ప్రకాశ్ రాజ్ పాత్రను చర్చించేవాళ్లం. ఇప్పుడు సూర్య అద్భుతంగా సృష్టించిన ప్రతినాయకుడి పాత్రలో అదరగొట్టారు. రేపు ‘గేమ్ ఛేంజర్’లో కూడా అలానే ఉంటారు. ‘గేమ్ ఛేంజర్’లో సూర్య ప్రతినాయకుడి పాత్ర చేస్తుంటే, తెలుగు పరిశ్రమలో కొత్తదనంగా ఉంటుందని అనుకున్నాను. కానీ, ఆయన ఇప్పటికే తన స్థానం సంపాదించుకున్నారు ఈ వ్యాఖ్యలతో చెర్రీ అభిమానుల్లో ఒక్కసారిగా ఉత్సాహం పెరిగింది.