గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా ‘గేమ్ చేంజర్’. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటి వరకు ఈ మూవీ నుంచి ఒక లిరికల్ వీడియోను మాత్రమే విడుదల చేశారు. గత రెండేళ్లుగా చిత్రీకరణ జరుపుతుకుంటోన్న ఈ మూవీ విడుదల ఎప్పుడు అనేది ఇప్పటి వరకు క్లారిటి రాలేదు. అంతే కాకుండా.. కమల్ హాసన్ ‘భారతీయుడు 2’పై ఫోకస్ పెట్టిన శంకర్ ‘గేమ్ చేంజర్’ షూటింగ్‌ను పక్కకు పెట్టినట్లు వార్తలు రావడంతో రామ్ చరణ్ ఫ్యాన్స్ నిరుత్సాహం వ్యక్తం చేశారు. తాజాగా ఈ చిత్ర షూటింగ్‌ను మళ్లీ స్టార్ట్ చేశాడు శంకర్. ప్రస్తుతం ఈ చిత్రీకరణ చివరి దశలో ఉందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఇటీవల ఈ సినిమా రిలీజ్‌పై దిల్‌రాజ్ మాట్లాడుతూ.. ‘డిసెంబర్‌లో క్రిస్మస్ స్పెషల్‌గా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాము’ అంటూ చెప్పుకొచ్చాడు. కానీ డేట్ మాత్రం క్లారిటీగా చెప్పలేదు.
దీంతో అసలు ‘గేమ్ చేంజర్’ ఈ ఏడాది వస్తుందో లేదో అనే డైలమాలో పడిపోయారు ఫ్యాన్స్. ఇలాంటి గంధరగోళ పరిస్థితుల్లో ‘గేమ్ చేంజర్’ రిలీజ్‌పై క్లారిటీ ఇస్తూ.. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఓ పోస్ట్ పెట్టాడు. ఈ మేరకు ‘సెప్టెంబర్ 25న ఓ ప్రకటన రానుంది. అలాగే ఈ #గేమ్ చేంజర్ డిసెంబర్ 20, 2024 విడుదల కానుంది’ అంటూ తన X వేదికగా క్లారిటీ ఇచ్చాడు. ప్రజెంట్ ఈ పోస్ట్ వైరల్ కావడంతో ఫ్యాన్స్ పండుగా చేసుకుంటున్నారు. అలాగే సెప్టెంబర్ 25న ప్రకటన అంటే.. సెకండ్ సింగిల్ అయుంటుందని కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. ఈ మూవీలో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తుండగా.. సినీయర్ నటుడు శ్రీకాంత్, ఎస్.జె సూర్య, అంజలి, నవీన్ చంద్ర తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.