టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన కొత్త హీరోయిన్స్‌కు మొదటి సినిమా హిట్ అయితే వరుసగా ఆఫర్లు వస్తాయి. కానీ ఆ తర్వాత సినిమాలు కూడా హిట్ కావాలన్నది కీలకం. దీనికి మంచి ఉదాహరణగా నిలుస్తోంది జాతిరత్నాలు ఫేమ్ ఫరియా అబ్దుల్లా.
ఫరియా మొదటి సినిమా కామెడీ నేపథ్యంలో ఉండటంతో ఆమెకు గ్లామర్ షో చేసుకునే అవకాసం రాలేదు. కానీ ఇప్పుడు గ్లామర్‌కు తగిన పాత్రలు రాకపోవడంతో ఆమెకు కొంత నిరాశ ఎదురవుతోంది. ఈ టాల్ లేడీ రీసెంట్‌గా వి నెక్ కట్ మెరూన్ కలర్ డ్రెస్సులో తన అందాలను ప్రదర్శిస్తూ నెటిజన్లకు చెమటలు పట్టిస్తోంది.
ఫరియా మొదట సోలో హీరోయిన్‌గా కొన్ని ఆఫర్లు అందుకున్నా, తరువాత ఆమెకు సెకండ్ హీరోయిన్ పాత్రలు, ఆ తర్వాత నెగటివ్ క్యారెక్టర్స్ వరకూ పడిపోయాయి. యూట్యూబర్‌గా పాపులర్ అయిన ఫరియా, ఇప్పుడు “మత్తు వదలరా” సీక్వెల్‌లో తన లక్‌ని పరీక్షించుకోబోతోంది.
“మత్తు వదలరా” సీక్వెల్‌లో ఫరియా అబ్దుల్లా మెయిన్ రోల్ పోషిస్తుండగా, ఈ సీక్వెల్ కోసం ఆమె తాజాగా బోల్డ్ ఫోటోషూట్ చేసింది. అక్టోబర్ 13న ఈ సినిమా థియేటర్లలో విడుదల అవబోతోంది.
ఫరియా లేటెస్ట్ ఫోటోలు చూస్తే, ఆమె మగవాళ్ల మనసుల్ని గెలుచుకోవడానికి సిద్ధంగా ఉందనిపిస్తుంది. “మత్తు వదలరా” సీక్వెల్ ఆమెకు బ్రేక్ ఇస్తుందా లేదా, చూడాలి.
ఫరియా అబ్దుల్లా “మత్తు వదలరా” సీక్వెల్‌లో నిధి పాత్రలో కనిపించనుంది. పోస్టర్ చూస్తే, ఆమె పోలీస్ లేదా లేడీ విలన్ పాత్రలో కనిపించబోతుందని అర్ధమవుతోంది. ఈ బ్యూటీ సినిమా విడుదలయ్యాక ఎంత మాయ చేసిందో చూడాల్సి ఉంది.
ఇక ఫరియా అబ్దుల్లా తన యూత్ ఫాలోవర్స్‌తో కనెక్ట్ అయ్యేందుకు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. ఇటీవల స్లీవ్‌లెస్ బ్లాక్ బ్లౌజ్‌తో పాటు మ్యాచింగ్ శారీలో ఫోటోలకు పోజులిచ్చిన ఆమె, నెటిజన్లను ఫిదా చేసింది.
ఫరియాఅబ్దుల్లా రీసెంట్ ఫోటోలు చూసిన నెటిజన్లు హాట్ కామెంట్స్ షేర్ చేస్తున్నారు. హైట్ ప్రాబ్లమ్ కారణంగా సరైన బ్రేక్ రాకపోయినా, ఫరియా తన టాలెంట్‌తో మరింత ముందుకు వెళ్లాలని ప్రయత్నిస్తోంది.