మన హీరోలు.. మా హీరో అంటూ ఫ్యాన్స్ పండుగ చేసుకుంటారు. సినిమా రిలీజ్ రోజు టికెట్ రేట్లు పెంచినా, అప్పులు చేసి మరీ టికెట్లు కొంటారు. ఎంత మంది అభిమానులు కోటీశ్వరులు ఉన్నారో తెలియదు కానీ, వారి అభిమాన హీరోలు మాత్రం వేల కోట్ల రూపాయలు సంపాదించారు. భారతదేశంలో అత్యంత సంపన్న హీరోల లిస్టు చూస్తే షాక్ అవ్వాల్సిందే.
భారతదేశంలో అత్యంత సంపన్న హీరోలు:
- షారూఖ్ ఖాన్: బాలీవుడ్ కింగ్ షారూఖ్ ఖాన్ ఆస్తులు సుమారు 7,300 కోట్ల రూపాయలు. ఆయన సినిమాలు, ఐపీఎల్ ఫ్రాంచైజీలు, యాడ్స్ ద్వారా సంపాదించారు. నెంబర్ వన్ స్థానం ఇతనిదే.
- జూహ్లీ చావ్లా: 4,600 కోట్ల రూపాయల ఆస్తులతో రెండో స్థానంలో ఉన్నారు. సినిమాలు, వ్యాపారం, క్రికెట్ రంగంలో పెట్టుబడుల ద్వారా ఆమె సంపాదించారు.
- హృతిక్ రోషన్: 2,000 కోట్ల రూపాయల ఆస్తులతో మూడో స్థానంలో ఉన్నారు. ఆయన సినిమాలు, యాడ్స్, మరియు స్పోర్ట్స్ రంగంలో పెట్టుబడులు పెట్టారు.
- అమితాబ్ బచ్చన్: 1,600 కోట్ల రూపాయల ఆస్తులతో నాలుగో స్థానంలో ఉన్నారు. ఆయన సినిమాలు, టీవీ షోలు, రియల్ ఎస్టేట్, యాడ్స్ ద్వారా సంపాదించారు.
- కరణ్ జోహార్: 1,400 కోట్ల రూపాయల ఆస్తులతో ఐదవ స్థానంలో ఉన్నారు. ఆయన సినిమా ప్రొడక్షన్ హౌస్, డిస్ట్రిబ్యూషన్, టీవీ షోలు, యాడ్స్ ద్వారా సంపాదించారు.
ఈ సెలబ్రిటీలు టెక్నాలజీ, సోషల్ మీడియా, స్పోర్ట్స్ రంగాలలో పెట్టుబడులు పెట్టి మరింత సంపాదించారు. వీరు ఎప్పటికప్పుడు ట్రెండ్ లో ఉండేలా, తమ సంపదను పెంచుకుంటున్నారు.