శ్రీలీల శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా చేసిన ‘పెళ్లి సందడి’ సినిమాతో హీరోయిన్‌గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించి మెప్పించింది. ముఖ్యంగా రవితేజతో చేసిన ‘ధమాకా’ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఆమె ఓవర్‌నైట్ స్టార్ అయిపోయింది. ఈ నేపథ్యంలో ఆమెకు చేతినిండా అవకాశాలు వచ్చాయి. ఒకేసారి పది సినిమాల్లో నటించే చాన్స్ దక్కించుకుంది.
కానీ వరుసగా నాలుగు డిజాస్టర్లు తన ఖాతాలో పడటంతో ఒక్కసారిగా క్రేజ్ తగ్గిపోయింది. దీని ఫలితంగా కొన్ని సినిమాల నుంచి తొలగించారని వార్తలు వచ్చాయి. ఇటీవల శ్రీలీల మహేష్ బాబుతో ‘గుంటూరు కారం’ మూవీ చేసింది. ఈ చిత్రం పెద్దగా హిట్ అవ్వకపోవడంతో ఆమె కొంత గ్యాప్ తీసుకుంది. ప్రస్తుతం ఆమె రవితేజతో ఒక సినిమా చేయబోతుంది, అలాగే నితిన్‌తో ‘రాబిన్ హుడ్’, పవన్ కల్యాణ్‌తో ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ మూవీలో కూడా నటిస్తోంది.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో శ్రీలీల పెళ్లి వార్తలపై స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ‘‘చదువు మధ్యలో వదిలేసి సినిమా ఇండస్ట్రీకి వచ్చాను. ఇప్పుడు మళ్లీ చదువుపై దృష్టి పెట్టాను. మధ్యలో వదిలేసిన చదువును పూర్తి చేయాలనుకుంటున్నాను. అందుకే ఎక్కువ సినిమాలకు కమిట్ అవ్వడం లేదు. ప్రస్తుతానికి చదువు, నటనపై కాకుండా నా వ్యక్తిగత విషయాలపై శ్రద్ధ పెట్టడం లేదు. నాకు అంత టైమ్ లేదు. కొద్దికాలం తర్వాత వ్యక్తిగత విషయాలపై దృష్టి పెట్టాలని భావిస్తున్నాను’’ అని శ్రీలీల చెప్పింది.c