‘భలే ఉన్నాడే’ సినిమా విడుదల సమయం దగ్గర పడడంతో హీరో రాజ్ తరుణ్ ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నాడు. ఇటీవల ఆయన ఒక ఇంటర్వ్యూలో పాల్గొని, ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా రాజ్ తరుణ్ మాట్లాడుతూ, “కొద్దిరోజుల క్రితం ఓ డైరెక్టర్ నాకు కథ వినిపించడానికి వచ్చాడు. అతడు కథలో హీరోయిన్ ఇంట్లో ఎవరూ లేని సమయంలో హీరో ఆమెతో కప్లింగ్ చేయాల్సి ఉంటుందంటూ చెప్పాడు,” అని చెప్పుకొచ్చాడు.
స్పష్టమైన సమాధానం ఇచ్చిన రాజ్ తరుణ్
రొమాంటిక్ కథను వినిపించిన ఆ డైరెక్టర్‌కి రాజ్ తరుణ్ గట్టి సమాధానం ఇచ్చాడని చెప్పాడు. “అతడు కథ చెప్పగానే, నేను స్పష్టంగా చెప్పాను, నేను బ్లూఫిల్మ్‌లు చేయను, నేను సినిమాలు మాత్రమే చేయాలనుకుంటున్నాను,” అని రాజ్ తరుణ్ హాజరైన ఇంటర్వ్యూలో వెల్లడించాడు.
రాజ్ తరుణ్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్ టాపిక్ గా మారాయి, సినీ ప్రియుల మధ్య విస్తృతంగా చర్చనీయాంశంగా మారాయి.