ఈరోజు టాలీవుడ్ ప్రముఖ హీరో ఎన్టీఆర్ మరియు డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో రూపొందిన “దేవర” చిత్రం ట్రైలర్ విడుదలైంది. మాస్ డైలాగ్స్, యాక్షన్ సీన్స్‌తో ట్రైలర్ అదిరిపోయింది. ముఖ్యంగా ఎన్టీఆర్ డబుల్ యాక్షన్ సన్నివేశాలు, డైలాగ్స్, విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ వాయిస్ ఓవర్, సైఫ్ అలీ ఖాన్ నెగిటివ్ షేడ్స్ యాక్టింగ్ ఇవన్నీ కూడా ట్రైలర్‌కి హైలెట్‌గా నిలిచాయి.
ట్రైలర్ మొదలైన 90 సెకన్ల తర్వాత జాన్వీ కపూర్ ఎంట్రీ ఇచ్చింది. అయితే కేవలం ఒకట్రెండు డైలాగులు చెప్పి తళుక్కున మెరిసి ఇలా వచ్చి అలా వెళ్లింది. దీంతో “దేవర” ట్రైలర్ చూసిన జాన్వీ కపూర్ అభిమానులు కొంతమేర నిరాశకు గురైనట్లు తెలుస్తోంది.